Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 10,2023: మేమున్నాము’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే ది’10’ సెప్టెంబర్ అని, ఎందుకంటే ఈరోజున “ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం” అని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణిలు అన్నారు. డా. హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో మీడియాతో మాట్లాడారు.

10 సెప్టెంబర్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ స్కూల్లో, కాలేజీల్లో వారు రోజుల పాటు ఉచిత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

జబ్బులు కంటే ఆత్మహత్యల వల్ల ప్రజలు అధికంగా చనిపోయే ప్రమాదముందని చెప్పారు. 10 నుంచి 29 మధ్య వయస్సు కలవారే ఎక్కువ చనిపోతున్నారన్నారు.

ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సైకియాట్రిస్ట్ లు డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, డా.రవ్వ హరి కుమార్, డా. కిషోర్ కుమార్ (తిరుపతి) పాల్గొంటారన్నారు.

‘నాకెవరున్నారు’ అనే వారందరికీ మీమున్నామంటూ ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు వారం రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డా.జి.వీరభధ్రం, డా.జనార్థనం, డా.క్యార్లిన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాతో మాట్లాడండి. సమస్యల నుంచి విముక్తులు కండి. వివరాలకు 9390044031/40.

error: Content is protected !!