365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 15, 2023: నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త జనరల్ మేనేజర్‌గా సుఖ్‌బీర్ సింగ్ ను నియమించారు. సుఖ్‌బీర్ సింగ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సర్వీసెస్‌లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
హోటల్ కార్యకలాపాలు, సేల్స్, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి, సంబంధాల నిర్వహణ, విజయవంతమైన హోటల్ పనితీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.
సుఖ్‌బీర్ నేపథ్యం :హోటల్‌లను నిర్వహించడంలో, ఆదాయాన్ని పెంచుకోవడంలో అతిథి సంతృప్తిని మెరుగుపరచడంలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
ఆయన అకార్ గ్రూప్, ఐటీసీ హోటల్స్, ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తోపాటు ప్రముఖ హోటళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. సుఖ్‌బీర్‌కు హాస్పిటాలిటీ ఇండస్ట్రీపై లోతైన అవగాహన ఉంది.
జనరల్ మేనేజర్‌గా సుఖ్బీర్ హోటల్ కార్యకలాపాలేకాకుండా అన్ని అంశాలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అతిథి సంతృప్తిని నిర్ధారించడం నుంచి హోటల్ ఆర్థిక నిర్వహణ వరకు.
ఆయన ప్రతిభావంతులైన నిపుణుల బృందానికి కూడా నాయకత్వం వహిస్తారు. హోటల్ ను అభివృద్ధి చేయడానికి అందరితో కలిసి పని చేయనున్నారు.
ఈ స్థానానికి ముందు, సుఖ్బీర్ నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 2011 నుంచి 2013 వరకు సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. తన కెరీర్ పరంగా సవాలు వాతావరణంలో రాణించాడు.
హోటళ్లను ప్రారంభించడం, పునఃస్థాపన చేయడం, ఉద్యోగులు, అతిథి సంతృప్తి స్కోర్‌లను సాధించడం వంటి నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.
సందర్భంగా సుఖ్‌బీర్ మాట్లాడుతూ “నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త జనరల్ మేనేజర్‌గా చేరడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
హోటల్ నిరంతర విజయానికి దోహదపడే ప్రతిభావంతులైన బృందంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను”అని ఆయన తెలిపారు