365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 4,2024: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ – 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది.
నాలుగు నుంచి ఏడో తరగతి వరకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10 న ముగుస్తాయి. 12 రోజుల పాటు ఉదయం 8.30గం.ల నుంచి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు జరగనున్నాయి. అలాగే 8, 9, 10వ తరగతుల వారికి మే 14 నుంచి మే 25 వరకు క్లాసులు జరగనున్నాయి.

ఇవి కూడా 12 రోజుల పాటు ఉదయం 8.30గం.ల నుంచి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు జరగనున్నాయి. వెబ్ సైట్‌లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్ఈ తెలిపింది. ఏప్రిల్ 28న ప్రారంభ కార్యక్రమం జరగనుంది.
ఏప్రిల్ 15 – 25 వరకు 12 రోజుల పాటు శ్రద్ధ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఇంటర్ విద్యార్థులు.. 11, 12 తరగతులకు చెందిన వారు అర్హులు. 12వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. వీరికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు తరగతులు ఉంటాయి.

ఈ శిబిరంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసేలా స్వామిజీలు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నంబర్ 9177232696 లో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.
This Also read::Dettol Celebrates The Big Dreams Of India With Its New Campaign; Launches New Bigger Dettol Soap
ఇది కూడా చదవండి: క్యాన్సర్ కు సరసమైన జన్యు చికిత్సను ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి
ఇది కూడా చదవండి:ప్రపంచ ఎలుకల దినోత్సవం..ప్రత్యేక కథనం..
ఇది కూడా చదవండి:కేక్ తిని బాలిక మృతి చెందడంతో బేకరీలు, షాపులపై దాడులు చేసిన ఆరోగ్యశాఖ
ఇది కూడా చదవండి: OnePlus Nord CE4 ఫోన్ కొంటే..ఇయర్ బడ్స్ ఫ్రీ..నేటి నుంచే అమ్మకాలు..
This Also read: XUV 3XO: The Newest SUV from Mahindra
ఇది కూడా చదవండి:XUV 3XO: మహీంద్రా నుంచి సరికొత్త ఎస్‌యూవీ
This Also read: Get your home summer ready at the lowest price with Amazon.in’s Home Shopping Spree
This Also read: Summer 2024 on a cruise. ‘Live’ acts by King, Dj Chetas, Family Fun and a lot more.