365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 12, 2025: రామకృష్ణ మఠం విద్యార్థుల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్మిషన్ కోరుకునే తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ గుర్తింపు కార్డుతో రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయాన్ని సందర్శించాలని అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.
ఇది కూడా చదవండి..అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ : ప్రదీప్ మాచిరాజు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉంది..?
Read this also…Campa Signs Ram Charan as Brand Ambassador, Launches Inspiring New Campaign ‘Campa Wali Zidd’
Read this also…Tira Turns Two: A Bold New Chapter in India’s Beauty Evolution
ఏడో తరగతి విద్యార్థుల కోసం ఏప్రిల్ 28 నుంచి మే 11 వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు మే 12 నుంచి మే 25 వరకు ‘సంస్కార్’ పేరిట శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాల్లో ధ్యానం, యోగాసనాలు, నైతిక విలువలపై నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఏప్రిల్ 14 నుంచి 24 వరకు ‘శ్రద్ధ’ పేరుతో వ్యక్తిత్వ వికాస శిబిరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానం, యోగాసనాలతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నైతిక అంశాలపై శిక్షణ అందిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 040-27627961, 9177232696 నంబర్లలో సంప్రదించాలని స్వామి బోధమయానంద సూచించారు.