365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి10,2026 : సంక్రాంతి పండుగ వేళ తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. జనవరి 11 (ఆదివారం) మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుస ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనుంది.
మధ్యాహ్నం 3:30 గంటలకు: ‘మిత్ర మండలి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా ‘మిత్ర మండలి’ తొలిసారిగా బుల్లితెరపై సందడి చేయనుంది. నలుగురు స్నేహితుల జీవితం ఒక రాజకీయ నాయకుడి కుమార్తె ప్రవేశంతో ఎలాంటి మలుపులు తిరిగింది? వారు పడ్డ తిప్పలు, కామెడీ గందరగోళం ఈ సినిమా హైలైట్. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వుల విందును అందించనుంది.
Read this also:Zee Telugu’s Sankranthi Double Treat: ‘Mithra Mandali’ Premiere & Star-Studded Gala..
ఇదీ చదవండి:బంగాళాఖాతంలో ముదురుతున్న ముప్పు.. ఏపీపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్..
ఇదీ చదవండి:‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. !
సాయంత్రం 6 గంటలకు: ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’
సాయంత్రం వేళ సినీ తారల సందడితో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు. స్టార్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుధీర్ తమదైన హాస్యంతో షోను రక్తికట్టించనున్నారు.
రవితేజ రాక: ‘మాస్ మహారాజా’ రవితేజ తన హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లతో కలిసి ఈ వేడుకలో తళుక్కున మెరవనున్నారు.

రాజా సాబ్ సందడి: ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్ర బృందం నుంచి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
నవ్వుల పువ్వులు: దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో యాంకర్లపై చేసే సెటైర్లు, చిన్న పిల్లల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.
సరదా కబుర్లు, ఆటపాటలు, జానపద నృత్యాలతో సాగే ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఇంటా పండుగ కళను తీసుకురానున్నాయి.
