365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 3,2025: ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని రెట్టింపు చేసిన ZEE5.. తాజాగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మజాకా’ అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేయడం విశేషం. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కామెడీ, రొమాన్స్, తండ్రీకొడుకుల ఎమోషనల్ డ్రామాతో మజాకా చిత్రాన్ని రూపొందించగా, ZEE5లో ఇది ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
Read this also…“Mazaka” Creates Ugadi Sensation on Zee5 with 100 Million Streaming Minutes!
ఇది కూడా చదవండి...కనిగిరిలో పరిశ్రమల విస్తరణకు బాట – మంత్రి లోకేష్ సహకారంతో రిలయన్స్ సీబీజీ ప్లాంట్
రావు రమేష్ – సందీప్ కిషన్ కాంబో హైలైట్
ఈ సినిమాలో రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రీకొడుకులుగా నటించగా, వారి మధ్య సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హాస్యంతోపాటు భావోద్వేగాలను మిళితం చేసిన ఈ కథానాయకుల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం అందించడంతో, ఇటీవల విడుదలైన రఘు తాత, కుడుంస్థాన్, విమానం వంటి సినిమాల తరహాలోనే కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ZEE5 ప్రతినిధుల హర్షం
ZEE5 SVOD సౌత్ వైస్ ప్రెసిడెంట్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ‘మజాకా’ చిత్రం ZEE5లో టాప్ ర్యాంక్‌లో ఉంది. ఈ చిత్రం తెలుగులో ఓటీటీ విభాగంలో కొత్త రికార్డు సృష్టించిందంటే ఆనందంగా ఉంది. రావు రమేష్, సందీప్ కిషన్‌ల మధ్య కెమిస్ట్రీ, వారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మా ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి మరిన్ని సూపర్‌హిట్ సినిమాలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.
రావు రమేష్, సందీప్ కిషన్ సంతోషం
సినిమాకు వస్తున్న అపూర్వ స్పందనపై రావు రమేష్ మాట్లాడుతూ.. “మజాకా’కు ఇంతటి ఆదరణ లభిస్తుందనుకోలేదు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమపాళ్లలో మేళవించి చేసిన ఈ చిత్రాన్ని ZEE5 వీక్షకులు ఎంతో ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతటి గొప్ప పాత్రను పోషించే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు” అని అన్నారు.
Read this also…Andhra Pradesh Takes a Green Leap: Nara Lokesh Lays Foundation for Reliance CBG Plant in Prakasam
Read this also…Reliance Launches First CBG Plant in Andhra Pradesh, Plans Rs.65,000 Crore Investment for 500 Green Energy Hubs
సందీప్ కిషన్ కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ.. “డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ‘మజాకా’ సినిమా సూపర్ హిట్ కావడం, 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటడం చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర కొంత సవాల్‌గా అనిపించినా, ఆ క్యారెక్టర్‌ని జీవించడం గొప్ప అనుభూతి. కామెడీ, ఎమోషన్ కలబోసిన ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.