365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మెక్సికో, సెప్టెంబర్ 25, 2024: ప్రపంచంలోనే అత్యున్నత ధనవంతుల జాబితాలో పేరు కలిగిన కార్లోస్ స్లిమ్ హెలూతో టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ కన్సల్ట్ ఇంటర్నేషనల్ లోగో ఆవిష్కరించిన కార్లోస్ ఏఐ ఆధారిత టెలీ కన్సల్టేషన్ ప్లాట్‌ఫాంపై ఆసక్తి కనబర్చడమే కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ల పూల్ ఏర్పాటు చేస్తున్న టీ కన్సల్ట్ చొరవను ఆయన ప్రశంసించారు. మెక్సికోలో జరిగిన ఈ సమావేశంలో టీ కన్సల్ట్ ఆవిష్కరణల పట్ల కార్లోస్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు.
టెలీ కమ్యూనికేషన్ రంగంలో సుప్రసిద్ధుడు అయిన కార్లోస్ స్లిమ్ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార రంగంలో విశేష ప్రతిభను కలిగి ఉన్నారు. దేశీయ వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, ఈ ప్రక్రియలో కావాలసిన మద్దతు అందించడం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం వంటి విషయాల్లో టీ కన్సల్ట్ పేరు కలిగి ఉంది. దీంతోపాటుగా టీ కన్సల్ట్ “గ్లోబల్ ఇన్వెస్టర్ పూల్”ను సైతం ఏర్పాటు చేసింది. టీ కన్సల్ట్ ద్వారా ప్రారంభమైన ఈ ఆవిష్కరణల పట్ల కార్లోస్ విశేష ఉత్సాహాన్ని కనబర్చారు. ఈ సందర్భంగా కార్లోస్ స్లిమ్‌ను సందీప్ మఖ్తల సంప్రదాయ భారతీయ శాలువాతో సన్మానించారు.
ఈ కీలకమైన సమావేశం నేపథ్యంలో సందీప్ మఖ్తల మాట్లాడుతూ, “టీ కన్సల్ట్‌కు ఈ సమావేశం ఎంతో ముఖ్యమైనది. టీ కన్సల్ట్ ఏఐ ఆధారిత టెలీ కన్సల్టేషన్ ప్లాట్‌ఫాం పట్ల కార్లోస్ స్లిమ్ ఆసక్తి చూపించడం ద్వారా గ్లోబల్ కన్సల్టేషన్ సర్వీస్ విషయంలో మా నిబద్దతను చాటి చెప్తుంది. టీ కన్సల్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ పూల్ ద్వారా పెట్టుబడులను భారతదేశానికి రప్పించడంపై దృష్టి పెట్టాం. అంతర్జాతీయ వ్యాపారాన్ని సులభతరం చేయడం.చేరువ చేయడంపై కృషి చేస్తున్నాం”అని చెప్పారు.
కార్లోస్ స్లిమ్ యొక్క విశేష నైపుణ్యం,టీ కన్సల్ట్,కటింగ్ ఎడ్జ్ ప్లాట్‌ఫం సంయుక్త కార్యాచరణ వల్ల భారతదేశంలోకి పెట్టుబడులు రావడంతో పాటుగా సాంకేతికపరమైన ప్రయోజనాలు సైతం చేకూరేందుకు అవకాశాలు ఏర్పాటు అవుతాయి. దీంతోపాటుగా దేశీయ వ్యాపార సంస్థలు వృద్ధి చెందే వీలు కలుగుతుంది. సాంకేతికత బదిలీ, నూతన అవకాశాల కల్పన , అంతర్జాతీయ అవకాశాలను సొంతం చేసుకునే దిశగా ఈ ముందడుగు ఉపయోగపడుతుంది.