Sat. Sep 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు19, 2024 : రక్షాబంధన్ రోజున ఆకాశంలో ఒక అద్భుతం జరుగనుంది. రాఖీ పౌర్ణమి రోజున, భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:56 గంటలకు, ఆకాశంలో సూపర్ బ్లూమూన్ దర్శనమివ్వనుంది. అంటే, చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 30% ఎక్కువ ప్రకాశవంతంగా, 14% పెద్దగా కనిపిస్తాడు.

ఈ ఏడాది కనిపించనున్న 4 సూపర్ బ్లూమూన్లలో ఇది మొదటిది. మిగతా సూపర్ బ్లూమూన్లు సెప్టెంబర్ 17, అక్టోబర్ 17, నవంబర్ 15 తేదీల్లో కనిపించనున్నాయి. భూమికి చంద్రుడు అతిదగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ బ్లూమూన్లు ఏర్పడతాయి.

error: Content is protected !!