365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29, 2021: పర్యావరణ అనుకూలమైన రీతిలో చిన్నారుల కోసం అనువైన ఉత్పత్తులను తీర్చిదిద్దే స్టార్టప్‌సూపర్‌బాటమ్స్‌ ,శిశువులు,చిన్నారుల కోసం ఆర్గానిక్‌ టాప్‌ , సెట్‌ తో కూడిన తమ తాజా ఉత్పత్తి ఆఫరింగ్‌ కంఫర్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. శిశువులకు పునర్వినియోగించతగిన క్లాత్‌ డైపర్లను తీర్చిదిద్దడం ద్వారా సుప్రసిద్ధమైనది సూపర్‌బాటమ్స్‌.

SuperBottoms launches Organic Comfortwear for babies
SuperBottoms launches Organic Comfortwear for babies

కోవిడ్‌ కారణంగా అధికశాతం మంది చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సూపర్‌బాటమ్స్‌ వద్ద తల్లిదండ్రుల బృందం పిల్లలు ఇంటి వద్ద ధరించే వస్త్రాల పరంగా ఉన్న సమస్యను గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా యునిసెక్స్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌ , షార్ట్స్‌ను తీర్చిదిద్దారు. ధృవీకృత ఆర్గానిక్‌ కాటన్‌లో సూపర్‌ ఫన్‌ ప్రింట్స్‌ డిజైన్‌లో వీటిని తయారుచేశారు. ఈ టాప్‌ మరియు షార్ట్స్‌ సెట్‌లో ఎలాంటి అతుకులు, ట్యాగ్స్‌ ఉండవు. అందువల్ల చిన్నారులకు పూర్తి సౌకర్యవంతంగా ఉంటాయి.ఈ ఆవిష్కరణ గురించి సూపర్‌ బాటమ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో పల్లవి ఉతగి మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌ ఆరంభం అయిన తరువాత చిన్నారులు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ జీవనశైలి మార్పుకు తగినట్లుగా మారడం వారికి కష్టసాధ్యంగా ఉంది. అది దృష్టిలో ఉంచుకుని శిశువుల జీవితం ఇంటి వద్ద సౌకర్యవంతంగా మలచడానికి ఈ లాంజ్‌వేర్‌ డిజైన్‌ చేశాం. సూపర్‌బాటమ్‌ కంఫర్ట్‌వేర్‌ 100% ఆర్గానిక్‌ కాటన్‌తో రూపుదిద్దుకుంది. స్లీవ్‌లెస్‌ టాప్‌ మరియు షార్ట్స్‌ సెట్‌గా ఇవి వస్తాయి’’ అని అన్నారు.

చిన్నారుల కోసం సూపర్‌బాటమ్స్‌ కంఫర్ట్‌వేర్‌ సెట్‌ టాప్‌ , షార్ట్స్‌ నాలుగు సైజులు ః ఆరు నెలలు– ఒక సంవత్సరం ; 1–2 సంవత్సరాలు ; 2–4 సంవత్సరాలు ; 4–6 సంవత్సరాలు–లో లభ్యమవుతాయి.ఆఫర్‌ధర 349 రూపాయలలో www.superbottoms.com  వద్ద , అమెజాన్‌, న్యాకా, ఫ్లిప్‌కార్ట్‌ వద్ద ఇతర సుప్రసిద్ధ ఈ–కామర్స్‌ పోర్టల్స్‌, బేబీ కేర్‌ స్టోర్స్‌ వద్ద ఈ  కంఫర్ట్‌వేర్‌ సెట్‌ లభ్యమవుతుంది.