365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 21,2025: ప్రభుత్వ భవనాల్లో చిన్నారుల తల్లులు, పిల్లల సంరక్షణ సౌకర్యాల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. వీటిని నిర్ధారించాలని రాష్ట్రాలను కోరింది.
ఇది తల్లుల గోప్యతకు అవసరమని శిశువులకు ప్రయోజనకరంగా ఉంటుందని కోర్టు తెలిపింది. దీనితో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో కూడా ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం.
రెండు వారాల్లోగా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రాన్ని కోరింది.

ప్రభుత్వ భవనాల్లో పిల్లల సంరక్షణ, శిశువులకు తల్లిపాలు ఇవ్వడానికి ప్రత్యేక స్థలాల ప్రాముఖ్యతను గురించి సుప్రీంకోర్టు వెల్లడించింది. అటువంటి సౌకర్యాల లభ్యతను నిర్ధారించాలని రాష్ట్రాలను కోరింది.
జస్టిస్ బి.వి. నాగరత్న అండ్ జస్టిస్ ప్రసన్న బి. ఇటువంటి సౌకర్యాలు కల్పించడం వల్ల తల్లుల గోప్యతకు భరోసా లభిస్తుందని, శిశువులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. సాధ్యమైనంతవరకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్నబహిరంగ ప్రదేశాలలోఇలాంటి సౌకర్యాలను కల్పించాలని సుప్రీం కోర్టు కోరింది.
Read this also...‘Sammelanam’ Web Series Review
ఇది కూడా చదవండి…“సమ్మేళనం” వెబ్ సిరీస్ రివ్యూ ఎలా ఉంది..?
Read this also...JSW MG Motor India Achieves 15,000-Unit Production Milestone for MG Windsor
Read this also...ISB Study Highlights Challenges and Opportunities in AI Adoption for Tuberculosis Diagnosis in India
నిర్మాణంలో ఉన్న భవనాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి: సుప్రీంకోర్టు
‘ప్రభుత్వ భవనాలు ఇంకా ప్రణాళిక, నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ ప్రదేశాలలో తగినంత స్థలం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని’ అని ధర్మాసనం పేర్కొంది.

బహిరంగ ప్రదేశాల్లో శిశువులు, తల్లులకు తల్లిపాలు ఇచ్చే గదులు, పిల్లల సంరక్షణ గదులు లేదా ఏదైనా ఇతర సౌకర్యాల నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
ఈ అంశంపై ఫిబ్రవరి 27, 2024న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు ,నిర్వాహకులకు లేఖ రాశామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
Read this also...ట్రంప్ మరో కీలక నిర్ణయం.. అమెరికా ఆరువేల ఐఆర్ ఎస్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం..
Read this also...Sri Kapileswara Swamy Blesses Devotees on Suryaprabha Vahanam
Read this also...Sri Padmavati Devi Blesses Devotees in Dhanalakshmi Alankaram on Kalpavriksha Vahanam
గోప్యత..
పిటిషన్‌లో చేసిన డిమాండ్లను కార్యదర్శి రాసిన లేఖలో చేర్చడం పట్ల ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఈ సలహాను అమలు చేస్తే, తల్లిపాలు ఇస్తున్నప్పుడు యువ తల్లులు, శిశువుల గోప్యతను ఇది నిర్ధారిస్తుందని కూడా పేర్కొంది.
రెండు వారాల్లోగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నిర్వాహకులకు రిమైండర్‌గా సంప్రదింపులతో పాటు తన ఉత్తర్వు కాపీని పంపాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.