365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,డిసెంబర్ 16,2022: ఎర్రుపాలెం పీఎస్ ఎస్సైగా ఎం.సురేష్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఎర్రుపాలెం స్టేషన్లో పనిచేస్తున్న మెడా ప్రసాద్ ఖమ్మం టూ టౌన్పోలీస్ స్టేషన్ కు ట్రాన్సఫర్ అయ్యారు.
మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక బదిలీ అవుతున్నట్లు ఖమ్మం జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వెలువడటంతో ఆయన బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా ఎర్రుపాలెం పీఎస్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సురేష్ మాట్లాడుతూ.. మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.