365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,నవంబర్ 2,2022: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని.. వెంటాడుతున్నకిరాయి గుండాలు..జనసేన అధినేత హత్యకు కుట్ర జరుగుతోంది. అందుకు సంబంధించిన కిరాయి మూక హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరా లో రికార్డయిన విజ్యువల్స్ ను పోలీసులు గుర్తించారు.
మంగళవారం, బుధవారాల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పవన్ ఇంటివద్ద తచ్చాడినట్లు ఆధారాలు లభించాయి. మరికొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటివద్ద గొడవకు దిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ గురించి కూడా అనుమానిత వ్యక్తులు ఆరా తీసినట్లు సమాచారం. గుజరాత్ నుంచి వచ్చిన కొందరు గుండాలు జనసేన పార్టీ అధినేత ఇంటివద్ద తిరుగుతుండగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది గమనించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“ఆంధ్రప్రదేశ్ రెడ్డి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్” పేరుతో ఉన్న ఓ కారు కూడా జనసేనాని ఇంటి వద్ద తిరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పవన్ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు.