365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 16, 2024: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి)లో ఫోన్ ట్యాపింగ్, ఇతర చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన ఆరోపణలపై తదుపరి విచారణ కోసం ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావుకు సిటీ కోర్టు శనివారం ఏడు రోజుల కస్టడీని మంజూరు చేసింది.స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి)లో ఫోన్ ట్యాపింగ్ తోపాటు ఇతర చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తదుపరి విచారణ కోసం ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఎస్‌ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్, పరికరాలను ధ్వంసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌లో ఉంచిన డీఎస్పీని మూడు రోజులపాటు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు సీనియర్ పోలీసు అధికారుల పేర్లు బయటపడ్డాయి.