Fri. Nov 8th, 2024
viswanata chakravarthi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 17,2022: కొత్త వరవడి సృష్టించిన ఎస్వీఆర్ 1964 లో హిందీ లో ఉస్తాడోమ్ కి “ఉస్తాద్” పేరుతో వచ్చిన ఓ సినిమా విజయవంతం అయింది.

ఇందులో ప్రధాన పాత్రను షేక్ ముక్తార్ నటించారు. మోడరన్ థియేటర్స్ అధినేత సుందరం ఆ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అందుకు రంగం సిద్ధం అయ్యింది.

ఎడ్.డి.లాల్ దర్శకులు. ప్రధాన పాత్రకు ఎస్వీఆర్ గారిని తీసుకోవాలని, వారిని కలసి ఒక సారి మాతృక అయిన హిందీ సినిమాను చూడమని అడిగారు. వద్దు. ఆలా చూడడం నాకు ఇష్టం ఉండదు.

కథ గురించి, నా పాత్ర గురించి చెప్పండి. నచ్చితే నా పంధా లో నేను నటిస్తాను అని చెప్పారు. కథ విని ప్రధాన పాత్ర అయినా కత్తుల రత్తయ్య గా నటించడానికి ఒప్పుకున్నారు.

సినిమా కు “మొనగాళ్లకు మొనగాడు” అని పేరు పెట్టి ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణ గా సావిత్రి తో ఒక పాట పెట్టాలనుకున్నారు. కానీ ఆమె అప్పటికే చాలా బిజీ కథానాయకి అయిపోయింది.

ఆమె ఒప్పుకుంటుందా లేదో అని సందేహం. వారి మాటలు విన్న ఎస్వీఆర్ ఆ పాట నాతో అని చెప్పండి అన్నారు. ఎస్వీఆర్ ని బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే సావిత్రి ఆ మాట చెప్పగానే అంగీకరించారు.

అది ఎస్వీఆర్, సావిత్రితో తోలి పాట. చివరివరకు సస్పెన్సు తో నడిచే ఆ చిత్రంలో హరనాథ్, చలం, కృష్ణకుమారి, బాలయ్య కీలక పాత్రల్లో నటించారు. ఆ సినిమాకు కథానాయకుని కంటే ఎక్కువ పారితోషం ఇచ్చింది ఎస్వీఆర్ కే.

తొలిసారి సరి కొత్త పాత్రలో ఎస్వీఆర్..

1966 లో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించారు. తొలిసారిగా సరి కొత్త పాత్రలో ఎస్వీఆర్ ను చూసిన ప్రజలు విశేషంగా ఆదరించారు. అలాటి పాత్ర కు కొత్త వరవడి సృష్టించారు ఎస్వీఆర్.

100 రోజుల అభినందన కార్యక్రమానికి షేక్ ముక్తార్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఉదయం మద్రాస్ కు చేరిన ఆయన సినిమా చూసి , సాయంత్రం సభకు వచ్చారు. ఎస్వీఆర్ వేదిక మీదికి రాగానే లేచి, ఎస్వీఆర్ ని కౌగలించుకొని అభినందించారు.

SVR special
viswanata chakravarthi

ఆయన ప్రసంగం లో ఇలా అన్నారు. ఈ సినిమా విజయవంతం కావడానికి కారణం ఎస్వీఆర్ అని నేను చెప్పడం అతిశయోక్తి కానీ కాదు. పచ్చి నిజం.

తన గంభీర విగ్రహం, అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఈ పాత్ర కు కొత్త వన్నెలు తెచ్చింది. నేను హిందీ లో ఈ పాత్ర లో నటించాను. బొంబాయిలో అందరూ నేను చాలా బాగా నటించానని అభినందించారు.

వాళ్ళు ఈ సినిమా చూడకపోవడమే కారణం.. ఎస్వీఆర్ నాకంటే చాలా బాగా చేశారు” అని షేక్ ముక్తార్ అన్నారు.

error: Content is protected !!