Fri. Nov 8th, 2024
peerzadiguda_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 24 మార్చి 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8నుంచి 30 వరకు ‘స్వచ్ఛోత్సవ్ -2023’ పేరిట కార్యక్రమాలు, మహిళలకు పోటీలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ డా. పి.రామకృష్ణ రావు అధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

peerzadiguda_365

‘స్వచ్ఛోత్సవ్ -2023’ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ‘విమెన్ ఇన్ స్వచ్ఛత’ నుంచి ‘ఉమెన్ లీడ్ స్వచ్ఛతకు మార్చే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణలో విజేతలైన మహిళలకు ఉమెన్ ఐకాన్ లీడింగ్ స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేస్తారు.

29న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ‘జీరో వేస్ట్’ అంతర్జాతీయ దినంగా ప్రకటించిందని ఇందులో భాగంగానే స్వచ్ఛ మషాల్ భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అందుకు సంబందించిన ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు.

చెత్త రహిత నగరాల కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులు సోర్స్ సేగ్రిగేషణ్ తడి,పొడి, హానికారక చెత్తను క్షేత్ర స్థాయిలో వేరుచేయడం, హోం కంపోస్టింగ్, ప్లాస్టిక్ వినియోగం, వేస్ట్ టూ వెల్త్ మొదలైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మరళి, రిసోర్స్ పర్సన్స్,స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

error: Content is protected !!