365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 31,2024: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్ వేదికగా నేషనల్ కంజ్యూమర్స్ రైట్స్ కమిషన్ (NCRC) ఆధ్వర్యంలో మెగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి గుర్తింపు పొందిన ప్రముఖులకు అవార్డులు అందజేశారు.

నేషనల్ కంజ్యూమర్స్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో మెగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులకు ఈ అవార్డులు అందజేశారు.

ఈ సంద‌ర్భంగా, వినూత్న ఆలోచ‌న‌లతో తన ప్రత్యేకమైన సాంకేతిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తూ, స్వామి ముద్దంకి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయకర్త వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎన్సీఆర్సీ ఫౌండర్ చైర్మన్ ఎంవీఎల్ నాగేశ్వరరావు, రిడ్జీ గ్రూప్ గ్లోబల్ చైర్మన్ ఎమ్మెన్నార్ గుప్త పాల్గొని స్వామి ముద్దంకి అవార్డు అందజేశారు.

ఈ అవార్డు స్వీకరణ సందర్భంగా స్వామి ముద్దం మాట్లాడుతూ, “ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు నా ప్రొఫెషనల్ ప్రయాణానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ గుర్తింపు ఉత్సాహాన్ని ఇస్తోంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.