365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మే 21,2022:శ్రీనివాసమం గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పంచ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.