365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మొహాలీ, మే 10,2024:దేశీయ ట్రాక్టర్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న, మహీంద్రా గ్రూప్ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ తమ ప్రచారకర్త, కస్టమర్ అయిన ఎంఎస్ ధోనీతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.
హార్టికల్చర్, దమ్ము పనులు, ఇతరత్రా సాగు పనుల్లో అధునాతనమైన ఫీచర్లు, శక్తిమంతమైన స్వరాజ్ టార్గెట్ 630 ట్రాక్టరు ఏ విధంగా ఉపయోగపడగలదనేది ఈ ప్రకటనలో చక్కగా వివరించింది.
ప్రకటనలో, ధోనీ తన స్నేహితుడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ స్వరాజ్ టార్గెట్ 630ని చూస్తారు. దాని ఫీచర్లు, పనితీరు చూసి ఆకర్షితుడై ఆ ట్రాక్టరును బైటికి తీస్తారు.
చెరకు తోటలు, ద్రాక్ష తోటలు, హార్టికల్చర్, వరి చేలు మొదలైన వాటిలో తిప్పుతూ పరిశీలిస్తారు. వివిధ అవసరాలకు ఉపయోగపడగలిగే స్వరాజ్ టార్గెట్ సామర్థ్యాలు, దాని అధునాతన ఫీచర్లు, పనితీరును తెలియజేసే విధంగా ఈ ప్రకటన ఉంటుంది.
ఎంఎస్ ధోనీతో ఇది స్వరాజ్ ట్రాక్టర్లకు సంబంధించి రెండో ప్రకటన. ఆయన నటించిన మొదటి ప్రకటనకు దేశవ్యాప్తంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. దానికి కొనసాగింపుగా, రైతులకు విశ్వసనీయమైన బ్రాండుగా స్వరాజ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే విధంగా కొత్త ప్రకటన రూపొందించింది.
కొత్త టీవీసీని స్వరాజ్ కోసం ఎఫ్‌సీబీ ఇంటర్‌ఫేస్ రూపొందించింది. ఇది 2024 మే 10 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లో ప్రసారమవుతుంది.
టీవీసీని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/b4mAOgVllAg
Also read:Swaraj Unveils new campaign for Target 630 featuring MS Dhoni
Also read: Surpassed ₹ 180 Bn in Revenues Highest Ever Yearly & Quarterly Revenue & Profitability
ఇది కూడా చదవండి: పింఛన్లు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు డీబీటీ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని బాబు కంప్లైంట్..