Fri. Nov 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 26,2024 : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలలో ప్రధానమైన స్విగ్గీ, ఇప్పుడు ప్రవాస భారతీయులు, స్థానికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఆహారం ,రోజువారీ అవసరాలను ఆర్డర్ చేసే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ సదుపాయం మొదటిదశలో అమెరికా, కెనడా, జర్మనీ, యుకె, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి 27 దేశాల ప్రవాసులకు అందుబాటులో ఉంది. అంతర్జాతీయ ఫోన్ నంబర్ ద్వారా స్విగ్గీ అకౌంట్‌కి లాగిన్ అవ్వడం, ఆహారాన్ని ఆర్డర్ చేయడం చాలా సులభం. అంతే కాకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా రోజువారీ అవసరాలను కూడా విదేశాల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. చెల్లింపులు అంతర్జాతీయ క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చేయవచ్చు.

స్విగ్గీ ద్వారా ప్రవాసులు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు బహుమతులు కూడా ఆర్డర్ చేయవచ్చు. పెద్ద వయస్సు ఉన్న తల్లిదండ్రులకు విదేశాల నుంచి నిత్యావసరాలు సరఫరా చేసే అవకాశం కూడా కల్పించింది. దీని ద్వారా చాలా కాలం విదేశాలలో ఉన్న ప్రవాసుల అవసరాలు తీరనున్నాయని స్విగ్గీ పేర్కొంది.

ఇది శాశ్వత సదుపాయంగా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా, మరో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా తమ బ్లింకిట్ ద్వారా ఇటువంటి సౌకర్యాన్ని తాత్కాలికంగా ప్రవేశపెట్టింది. కానీ స్విగ్గీ తమ విస్తృత నెట్‌వర్క్ కారణంగా దీన్ని మరింత విస్తృతంగా అందిస్తుంది. ప్రస్తుతం 600 నగరాల్లో దాదాపు 2 లక్షల రెస్టారెంట్లు స్విగ్గీతో కలిపి పని చేస్తున్నాయి. 43 నగరాల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కూడా గృహ అవసరాలను క్షణాల్లో డెలివరీ చేసేందుకు సహాయపడుతోంది.

error: Content is protected !!