Mon. Jan 6th, 2025 12:41:12 PM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 9, 2024: దేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంస్థ సింబియాసిస్ యూనివర్శిటీ. అలాంటి సింబియాసిస్ యూనివర్శిటీ క్రమం తప్పకుండా నిర్వహించే సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SNAP) 2024 ని నిర్వహిస్తోంది.

దీని ద్వారా సింబయాసిస్ MBA నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిందీ సంస్థ. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 5, 2024 నుంచి ప్రారంభం కానుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అధికారిక SNAP వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పరీక్ష నగరం,పరీక్ష తేదీ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ బేసిస్ పై అందించనున్నాయని దయచేసి విద్యార్థులు గమనించగలరు.

2024లో నిర్వహించే SNAP కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మూడు విభిన్న తేదీల్లో జరుగుతుంది. డిసెంబర్ 8, 2024 (ఆదివారం), డిసెంబర్ 15, 2024 (ఆదివారం),డిసెంబర్ 21, 2024 (శనివారం) రోజుల్లో నిర్వహిస్తారు. SNAP 2024 పరీక్షా ఫలితాలు జనవరి 8, 2025 (బుధవారం)న ప్రకటిస్తారు.

రాబోయే పరీక్ష ద్వారా ఔత్సాహిక అభ్యర్థులు ఒకే దరఖాస్తు ఫారమ్‌తో సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్శిటీ) కింద 17 ఇన్‌స్టిట్యూట్‌ ల లోని 27 ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అందుకుంటారు.

“సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా వినూత్నమైన, సరికొత్త ఆవిష్కరణలను అందించే నిపుణులను తయారు చేస్తామని మేం బలంగా నమ్ముతున్నాం. SNAP అనేది అద్భుతమైన వృత్తి విద్యా కోర్సులతో పాటు అసాధారణమైన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఉన్న గేట్‌ వే లాంటిది.

మేము ఔత్సాహిక విద్యార్థులను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం. తద్వారా వారు మాతో కలిసి వారి అత్యుత్తమ ప్రయాణాన్ని ప్రారంభించేలా ప్రోత్సహిస్తాం. అని అన్నారు” సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామకృష్ణన్ రామన్.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పరీక్ష భారతదేశంలోని 80 నగరాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను అభ్యర్థులు మొత్తంగా మూడు సార్లు ప్రయత్నించవచ్చు.

“బెస్ట్ ఆఫ్ త్రీ” విధానాన్ని అనుసరించి, అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షనే పరిగణిస్తారు. ప్రతి ప్రయత్నానికి రిజిస్ట్రేషన్ రుసుముగా రూ. 2250 చెల్లించాలి. ఒక్కో ప్రోగ్రామ్‌కి రూ. 1000 అదనపు రుసుము వర్తించనుంది.

ఇక సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SNAP) అర్హతల విషయానికి వస్తే… అభ్యర్థులు కనీసం 50% మార్కులతో (షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలకు 45%) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

చివరి-సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ చివరి పరీక్షలలో అవసరమైన కనీస మార్కులను పొందినట్లయితే, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అర్హతలు కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (AIU) నుంచి సమానత్వ ధృవీకరణ పత్రాన్ని పొందాలి.

SNAP అనేది సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్శిటీ)తో అనుబంధంగా ఉన్న అనేక ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లకు గేట్‌వేగా పనిచేస్తుంది. దీనిద్వారా MBA ప్రోగ్రామ్‌ లో వివిధ రకాల కోర్సులను చేయవచ్చు.

ఇక SNAP ద్వారా ప్రవేశం పొందే ప్రతిష్టాత్మక సంస్థలను ఒక్కసారి పరిశీలిస్తే.. SIBM పూణె, SICSR, SIMC, SIIB, SCMHRD, SIMS, SIDTM, SCIT, SIOM, SIHS, SIBM బెంగళూరు, SSBF, SIBM హైదరాబాద్, SSSS, SIBM NSCANO, నాగ్‌పూర్, SIBM, నాగ్‌పూర్ ఇందులో ఉన్నాయి.

ఈ పరీక్ష ఔత్సాహిక నిపుణులకు వ్యాపారం,నిర్వహణలో కెరీర్ వైపు మార్గం అందిస్తుంది.

50 ఏళ్లకు పైగా ఘనమైన వారసత్వాంన్ని కలిగిన సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్శిటీ) ప్రతిష్టాత్మకమైన NAAC A++ అక్రిడిటేషన్‌ను కలిగి ఉంది. NIRF 2023 ర్యాంకింగ్స్‌ లో యూనివర్సిటీల కేటగిరీలో 32వ స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా, ఇది QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ ద్వారా 641-650 శ్రేణిలో ర్యాంక్ లో ఉంది. ఎంప్లాయర్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ లో కోసం ప్రపంచవ్యాప్తంగా 31వ స్థానంలో నిలిచింది.

ఈ విభాగంలో భారతదేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా నిలిచింది. అంతేకాకుండా, QS ఇండియా ర్యాంకింగ్స్‌ లో భారతదేశంలోని రెండో ఉత్తమ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా గుర్తించబడింది.

పూణే, హైదరాబాద్, నాగ్‌పూర్, నాసిక్, నోయిడా,బెంగళూరులలో క్యాంపస్‌లతో, ఈ సంస్థ నాణ్యమైన విద్య,సమగ్ర అభివృద్ధి అవకాశాలను అందించడం ద్వారా భవిష్యత్ నాయకులను పోషించడానికి అంకితం చేయబడింది.

సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్శిటీ) రేపటి నాయకులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది, ప్రపంచ స్థాయి విద్య,సమగ్ర అభివృద్ధికి అవకాశాలను అందిస్తుంది.

మరింత సమాచారం కోసం ,మీ నమోదును ప్రారంభించడానికి, సందర్శించండి https://www.snaptest.org/.

error: Content is protected !!