Fri. Dec 20th, 2024

Tag: ఇండియా

Oppo |ఇండియాలోని యువత సాధికారతకు శ్రీకారం చుట్టిన ఒప్పో జీనియస్ ప్లస్ ప్రోగ్రామ్‌..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 8, 2021: ఇండియాలోని యువ ప్రతిభ సాధికారతకు ఒప్పో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “జీనియస్ ప్లస్ ప్రోగ్రామ్‌”ను రూపొందించింది. అందుకోసం ఐఐటీ ఢిల్లీ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఒప్పో సంస్థతో…

Mondelez India expands its presence into the morning snacking space with Bournvita Fills

బోర్న్‌విటా ఫిల్స్‌తో మార్నింగ్ స్నాకింగ్ స్పేస్‌లోకి ఉనికిని విస్తరించిన మాండెలేజ్ ఇండియా

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,భారతదేశం ,ఆగస్ట్ 28,2020: భారతదేశపు ఫేవరెట్ స్నాకింగ్ బ్రాండ్‌లలో భాగమైన క్యాడ్‌బరీ డైరీ మిల్క్, బోర్న్‌విటా, ఓరియో మొదలైన వాటికి మేకర్స్, బేకర్స్‌గా ఉన్న మాండెలేజ్ ఇండియా ఇప్పుడు బోర్న్‌విటా ఫిల్స్‌తో తన మార్నింగ్ స్నాగింగ్ ఉత్పత్తులను మరింత విస్తరించినట్టు ఈరోజు ప్రకటించింది. ఈ కంపెనీ తన వారసత్వాన్ని,అత్యంత ఆదరణ పొందిన బ్రాండ్ ,బోర్న్‌విటాను మార్నింగ్ స్నాకింగ్‌ శ్రేణిలోకి విస్తరించింది. బోర్న్‌విటా బిస్కట్స్ తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో ఈ సంస్థ ఈ ఉత్పత్తిని ముందుకు తెచ్చింది. బోర్న్‌విటాకు చెందిన ఈ వినూత్న కొత్త ఉత్పత్తి అనేది పోషకాలతో నిండిన మార్నింగ్ స్నాక్‌గా ఉండడం ద్వారా బలమైన ఎముకలు, బలమైన కండరాలు,చురుకైన మెదడు అనే బోర్న్‌విటాలోని పోషక ప్రయోజనాలు అందించడం ద్వారా దేశానికి అవసరమైన మార్నింగ్ స్నాకింగ్ అవసరాలను సంపూర్ణం చేయనుంది.ఈ ఆవిష్కరణ గురించి మాండెలేజ్ ఇంటర్నేషనల్‌కు చెందిన భారతదేశపు ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్ మాట్లాడుతూ, “గత 70 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా, మా ఉత్పత్తులు వినియోగదారులకు భావోద్వేగపరంగా,కార్యాచరణ స్థాయిలో ఆనందం కలిగిస్తున్నాయి. బోర్న్‌విటా అనేది వినియోగదారుల జీవితాల్లో ఒక కీలకమైన,విశ్వసనీయమైన పాత్ర పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, బోర్న్‌విటా బిస్కట్స్ ఆవిష్కరణ ద్వారా ఈ బ్రాండ్ విజయవంతంగా మార్నింగ్ స్నాక్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. నేడు కూడా అదే వ్యూహాత్మకతలో భాగంగా, బోర్న్‌విటా ఫిల్స్ ఆవిష్కరణ ద్వారా మార్నింగ్ స్నాకింగ్ విభాగంలోకి ఈ బ్రాండ్ అడుగుపెట్టింది. బోర్న్‌విటా ఫిల్స్ అనేవి తినడానికి సులభంగా,పోషకాలతో నిండిన స్నాక్‌గా ఉంటాయి. వీటిని పాలతో కలిపి తినొచ్చు లేదా అలాగే కూడా తినొచ్చు. ఈ ఉత్పత్తికి అద్భుతమైన అవకాశం కనిపిస్తోంది. అలాగే, మా వినియోగదారుల జీవితాల్లో ఈ ఉత్పత్తి పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందో అని మేము ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నాము” అన్నారు. మాండెలేజ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మార్కెటింగ్ (గమ్స్, క్యాండీస్, బేవరేజెస్,మీల్స్) – ఇంద్రప్రీత్ సింగ్ మాట్లాడుతూ, “బోర్న్‌విటా అనేది గత 70 సంవత్సరాలకు పైగా భారతదేశపు విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా ఉంటోంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులు అందించడం ద్వారా, దేశపు పోషకాహార అవసరాలను తీర్చడానికి ఇది కొనసాగిస్తూనే ఉంది. ఈ బ్రాండ్ విశిష్టత మరియు విశ్వసనీయత ఆధారంగా ఇప్పుడు బోర్న్‌విటా ఫిల్స్ అనే మరొక సంపూర్ణ ఉత్పత్తిని తీసుకొచ్చాము. పోషకాల మిశ్రమం,నోరూరించే రుచితో ఇది మా వినియోగదారుల జీవితాలకు మరింత విలువ జోడించనుంది. ప్రత్యేకించి, ఆరోగ్యకరమైన స్నాకింగ్ ఎంపికల కోసం వినియోగదారులు తీవ్రంగా అన్వేషిస్తున్న ఈ రోజుల్లో ఈ ఉత్పత్తి కీలకం కానుంది” అన్నారు.బోర్న్‌విటా ఫిల్స్‌తో ఈ కంపెనీ తన వినియోగదారులకు మరొక ఎంపిక అందించడమే కాకుండా, సరైన స్నాక్ అందుకోవడంలో వారికి సాధికారత కల్పిస్తోంది. తద్వారా, సరైన సమయంలో సరైన స్నాక్ అదించడం ద్వారా సరైన మార్గానికి బాటలు వేయడమనే కంపెనీ లక్ష్యాన్ని కూడా సజీవంగా ఉంచుతోంది. భారతదేశపు అత్యంత ఇష్టమైన, విశ్వసనీయమైన బ్రాండ్ బోర్న్‌విటా 70 సంవత్సరాల విశిష్ట వారసత్వం మీద ఆధారపడి, ఇలాంటి సరికొత్త ఎంపికలు పరిచయం చేయడం ద్వారా ఆవిష్కరణల పర్వాన్ని కొనసాగించడంతో పాటు తన పురోగామి స్నాకింగ్ ఎంపికలకు మరిన్ని కొత్త ఉత్పత్తులు జోడించే లక్ష్యాన్ని మాండెలేజ్ ఇండియా కొనసాగిస్తోంది.కొత్త ఉత్పత్తి గురించి గరిష్ట అవగాహన కల్పించడం కోసం, సమగ్రమైన మార్కెటింగ్ ప్రచారం కోసం కూడా ఈ సంస్థ సిద్ధమైంది. బోర్న్‌విటా ఫిల్స్ చిన్న ప్యాక్ (18 గ్రాములు) ధర రూ.10 ,పెద్ద ప్యాక్ (250 గ్రాములు) ధర రూ. 170గా నిర్ణయించారు. ప్రారంభంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,మహారాష్ట్రలోని మార్కెట్లలో అందుబాటులోకి రానున్న ఈ ఉత్పత్తి రానున్న నెలల్లో భారతదేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

error: Content is protected !!