అల్లం, తులసి,పసుపు పాల రకాలలో రోగ నిరోధకశక్తిని పెంచే పాలను విడుదల చేసిన హెరిటేజ్ ఫుడ్స్
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన,హైదరాబాద్, సెప్టెంబర్20,2020 ః వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు, ప్రతి రోజూ క్రమంలో భాగమైన అల్లం, తులసి,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది.శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో రెగ్యులేటరీ, థ్రోంబోటిక్ ప్రక్రియల కోసం హెరిటేజ్ అల్లం పాలు మేలు చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. వీటితో పాటుగా , శరీరంలో జీవక్రియలు మెరుగుపరిచేందుకు అల్లం తోడ్పడుతుందని నిరూపితమైంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా మలుస్తుంది. వేడి అల్లం పాలు కారణంగా గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గి గొంతు నొప్పి నుంచి ఉపశమనమూ కలుగుతుంది.హెరిటేజ్ తులసి పాలలో తులసి గుణాలుతో పాటుగా సబ్జా (స్వీట్ బాసిల్) విత్తనాలు,పుదీనా రసం ఉంటాయి. పాలలోని ఈ వనమూలికలు, చక్కటి రోగ నిరోధక వ్యవస్థను శరీరంలో సృష్టించేందుకు తోడ్పడతాయి. వాతావరణ మార్పుల వేళ ఎదురయ్యే అనారోగ్యాల నుంచి కాపాడటంతో పాటుగా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తులసి తోడ్పడుతుంది. తులసితో పాటుగా సబ్జా గింజలను కూడా జోడించి అందించడం వల్ల మానవ శరీరానికి మంచిది,ఇది కూలెంట్‌గా తోడ్పడుతుంది.పసుపులో చక్కటి యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియా,వైరస్‌ల కారణంగా ఎదురయ్యే ఎన్నో వ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ఫుడ్‌గా ఇది గుర్తించబడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పసుపు కలిగి ఉంటుందని నిరూపితం కావడం వల్ల ఖఛ్చితమైన రోగ నిరోధక శక్తి బూస్టర్‌గా నిలుస్తుంది.వీటి యొక్క క్రియాత్మక ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసిన ఇమ్యూనిటీ మిల్క్ వేరియంట్స్, తమ ఆరోగ్యం గురించి అమితంగా ఆందోళన చెందుతున్న ప్రగతి శీల,వివేకవంతులైన వినియోగదారులను ఆకర్షిస్తాయి. తమతో పాటుగా తమ కుటుంబసభ్యులకు కూడా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తూనే, రోగ నిరోధక శక్తి పెంపొందించుకునే అవకాశాలనూ అందించగలవని నమ్ముతున్నాం. ఈ పాలను 90 రోజుల పాటు నిల్వ చేయవచ్చు.హెరిటేజ్ ఇమ్యూనిటీ మిల్స్ వేరియంట్స్‌లో ఎలాంటి కృత్రిమ నిల్వ పదార్థాలూ ఉండవు,ఇవి సుప్రసిద్ధ ఆధునిక రిటైల్ స్టోర్లు, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఎంపిక చేసిన స్టాండలోన్ స్టోర్స్, ఎంపిక చేసిన హెరిటేజ్ ప్లార్లర్ల వద్ద 170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన పెట్ బాటిల్స్ రూపంలో బాటిల్ ఒక్కోటి 30 రూపాయలకు లభ్యమవుతాయి. హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు హెరిటేజ్ టచ్ యాప్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వినియోగదారులు ఇప్పుడు అన్ని పాలు,పాల పదార్థాలను ఆన్‌లైన్‌లో ఈ యాప్ ద్వారా తమ సౌకర్యం అనుసరించి ఇంటి వద్దకే ఆర్డర్ చేసుకోవచ్చు.వినియోగదారులు ఎల్లప్పుడూ ఐస్‌క్రీమ్‌లో నూతన రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు. వారి ఆసక్తికి మరింత వినోదం అందిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో క్లాసిక్, వినూత్నమైన,ఉత్సాహపూరితమైన ఫ్లేవర్స్‌ను కుకీస్ అండ్ క్రీమ్ , బెర్రీ రిపెల్,కారామిల్ రిపెల్‌లో విడుదల చేసింది.రుచికరమైన ఐస్‌క్రీమ్‌తో కుకీక్,ఐస్‌క్రీమ్‌తో మిళితం చేసిన డార్క్ కుకీస్ గొప్పదనాన్ని కుకీస్ అండ్ క్రీమ్ ఐస్‌క్రీమ్ అందిస్తుంది. బెర్రీ రిపెల్‌లో బెర్రీ రిపెల్ సాస్.కలర్డ్ చోకో బీన్స్ ఉన్నాయి. అదే సమయంలో, కారామిల్ రిపెల్‌లో కారామిల్ సాస్,వినోదాత్మక క్రిస్పీ చంక్స్ ఉంటాయి. రిపెల్ వేరియంట్స్ ఈ సీజన్‌లో మనోహరమైన రుచిని అందిస్తాయి,సండే ట్రాన్స్‌పరెంట్ కప్స్ రూపంలో లభ్యమవుతాయి.శ్రీమతి బ్రాహ్మణి నారా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరిస్తుండం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విజృంభిస్తున్న మహమ్మారి ఆవిష్కరణలను వేగవంతం చేసింది.వినియోగదారుల ఆరోగ్యం, సంతోషం కోసం అవసరమైన ఉత్పత్తులను ఆవిష్కరించడంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎల్లప్పుడూ ముందుంటుంది. సరైన సమయంలో సృజనాత్మక ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా మాత్రమే దానిని చేరుకోగలము.వినియోగదారుల అవసరాలను హెరిటేజ్ ఫుడ్స్ అర్ధం చేసుకుంటుంది,ఎన్నో విలువ ఆధారిత ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను వినియోగదారులకు తీసుకురావడంలో ముందుంటుంది’’ అని అన్నారు.ఆమె మరింతగా వెల్లడిస్తూ ‘‘రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆరోగ్యవంతమైన, పౌష్టికాహార ఉత్పత్తులు మొత్తం కుటుంబానికి అవసరమైన వేళ , రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ ఉత్పత్తులు సహాయపడతాయి, అందువల్ల వీటిని విడుదల చేయడానికి ఇప్పుడు తప్ప సరైన సమయమేదీ లేదు..’’ అని అన్నారు.