Mon. Oct 7th, 2024

Tag: forays

Mondelez India forays into Cakes category, with the launch of Cadbury Chocobakes Choc Layered Cakes

కేక్స్ విభాగంలోకి మాండెలెజ్

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ ఇండియా జూలై 4, 2020: క్యాడ్ బరీ డెయిరీ మిల్క్, క్యాడ్ బరీ బోర్న్ విటా, ఓరియో వంటి భారతీయ అభిమాన స్నాకింగ్ బ్రాండ్లలో కొన్నిటి తయారీదారు అయిన మాండలెజ్ ఇండియా నేడిక్కడ క్యాడ్ బరీ చాకొబేక్స్ చాక్ లేయర్డ్ కేక్స్ ఆవిష్కారాన్ని ప్రకటించింది. క్యాడ్ బరీ చాకోబేక్స్ చాకో ఫిల్డ్ కుకీస్ యొక్క వి జయవంతమైన ఆవిష్కరణ తరువాత, ఏడాది కంటే తక్కువ సమయంలోనే, చాకోబేకరీ ఉపవిభాగం కింద ఇది కంపెనీ యొక్క రెండో ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణతో కంపెనీ తమ అంతర్జాతీయ బేకింగ్ నైపుణ్యాన్ని,అంతా ఎంతగానో అభిమానించే చాకొలెటీ క్యాడ్ బరీ రుచిని ఒక్కచోటుకి చేర్చింది.  క్యాడ్ బరీ చా కొబేక్స్ చాక్ లేయర్డ్ కేక్స్ 2020 జూలై నుంచి లభ్యం కానున్నాయి.ఈ ఆవిష్కరణ గురించి మాండలెజ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్ మాట్లాడుతూ, ‘‘చా కొలెట్ రుచిని బార్ కు మాత్రమే పరిమితం చేయకుండా, అంతకు మించి ముందుకుతీసుకెళ్తూ, సంబంధిత విభాగాల్లోకి కూడా మా పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్నాం. నేడు బిస్కెట్స్ ,కుకీస్ లో మా పటిష్ఠ క్యాడ్ బరీ వారసత్వం , మా నిరూపిత సామర్థ్యం మమ్మల్ని లేయర్డ్ కేక్స్ తో బేకరీ , కేక్స్ విభా గంలోకి ప్రవేశించేలా చేశాయి. విడివిడిగా ర్యాప్ చేయబడి ఉండే చాకొలెటీ కేక్స్ తో మేం నూతన రుచి అనుభూతిని అందించడం మాత్రమే గాకుండా ఇంటా బయటా వినియోగదారు సౌలభ్యాన్ని మరింత అధికం చేస్తున్నాం. భారతదేశం లో మా కంపెనీ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి’’ అని అన్నారు. ‘‘ఈ కష్టకాలంలో, మార్కెట్లోకి ఈ నూతన ఉత్పాదనను తీసుకువచ్చేందుకు గత కొన్ని నెలలుగా కృషి చేసి న జట్లు మాకెంతో గర్వకారణం. మా వినియోగదారుల పట్ల మా అంకితభావాన్ని ఇది చాటి చెబుతుంది’’ అ ని అన్నారు.మాండలెజ్ ఇండియా మార్కెటింగ్ (బిస్కెట్స్) అసోసియేట్ డైరెక్టర్ సుధాంశు నాగ్ పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దేశంలో మా బిస్కెట్ల వ్యాపారం కూడా అటు అంతర్జాతీయంగా, ఇటు దేశంలో మా కీలక వృ ద్ధి చోదక శక్తులలో ఒకటిగా ఉంది. మా ప్రయాణం ఎప్పుడూ వినియోగదారులకు విశిష్ట రుచుల అనుభూ తులను, వివిధ రకాల ఉత్పాదనలను అందిస్తుంది. బోర్నవిటా బిస్కెట్స్ ,బనానా & ఓట్స్, ఓరియో క్యాడ్ బరీ డిప్డ్, క్యాడ్ బరీ చాకొబేక్స్ చాక్- ఫిల్డ్ కుకీస్ లాంటివి వీటిలో ఉన్నాయి. అవన్నీ కూడా మా అంకితభావానికి నిదర్శనం. మా తాజా ఉత్పాదన – క్యాడ్ బరీ చా కొబేక్స్ చాక్ లేయర్డ్ కేక్స్ ఈ విభా గాన్ని మరింత విస్తరించేందుకు మాకు తోడ్పడుతుందని, స్నాకింగ్ విభాగంలో మరిన్ని ఆసక్తిదాయక అవకాశాలను అందిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.ఈ విభాగానికి నిర్దిష్టమైన ఆశయాన్ని కలిగిన మాం డలెజ్ ఇండియా నూతన రుచుల అనుభూతులను అందించడం మాత్రమే గా కుండా రోజువారీ వినియో గ సందర్భాలకు అనుగుణ మైన ‘రుచికరమైన, విని యోగదారు సంబంధింత ఉత్పాదనలను ప్రవేశపెట్ట డం’ ద్వారా వినియోగదారులకు సరైన స్నాక్స్ తినడంలో సాధికారికతను కల్పించడాన్ని తన లక్ష్యంగా చేసుకుంది. 

error: Content is protected !!