Fri. Nov 22nd, 2024

Tag: Manipal Hospital

మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు పలురకాల అనారోగ్య ఇబ్బందులున్న రోగికి,కష్టమైన మూలకణ (బోన్‌ మారో) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసారు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పశ్చిమ గోదావరి, 31 డిసెంబర్‌,2020:మానవాళి మునుపెన్నడూ ఎదుర్కోనిఅత్యంత క్లిష్టమైన సవాళ్ళలో కోవిడ్‌-19 ఒకటి అన్నది వాస్తవం. మనందరం మన ఆరోగ్య స్థితిగతులను కాపాడుకోవలసిన ఆవశ్యకతను,ప్రతి ఒక్కరికి,నాణ్యమైన ఆరోగ్య సంరక్షణా పరిష్కారాలు లభించునట్లు సామర్థ్యంను పెంచుకోవలసిన అవసరాన్ని ఈ కరోనా మహమ్మారి మనముందుకు తెచ్చినది. ప్రపంచం తన ఆరోగ్య సంరక్షణకి పునరంకితమవుతున్న దిశగా, మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరి ఆరో గ్యపరమైన అన్నిరకాల ఇబ్బందులను పరిష్కరించుటకు సమాయత్తమైనది. రోగులు అవసరమైన చికిత్సలు కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళే శ్రమ లేకుండా అన్ని రకాలైన ఆరోగ్యసంరక్షణ పరిష్కారాలుఒకేచోట లభించే విధంగా హాస్పిటల్‌ సకల సదుపాయాలు కల్పించినది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వృత్తి రీత్యా రైతుపై విజయవంతంగా నిర్వహించిన మూలకణ (బోన్‌మారో) మార్పిడి శస్త చికిత్సఅందుకు ప్రత్యక్షనిదర్శనం. మొత్తం ఆంద్ర ప్రదేశ్‌ లో మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు మాత్రమే ఈ చికిత్సను అందించగలిగారు.“గత ఆరు నెలలుగా అంటే అక్టో బర్‌-2019 నుండి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని రోగి మా హాస్పిటల్‌ నకు,మార్చి-2020 లో రావటం జరిగినది. అంతేకాక అతను అప్పటికే వెన్నుపూసలో బీటలు (పగుళ్ళు), రక్తహీనత (ఎనీమియా), మూత్ర పిండాలు వనిచేయకపోవటం వంటి పలురకాలైన అనారోగ్య ఇబ్బందులు కలిగి వున్నారు. అతనిని పరీక్షించి,మల్టిపుల్‌ మైలోమా (ఒక రకమైన రక్త కణాల క్యాన్సర్‌) వ్యాధితో బాధపడుతున్నట్లు రోగనిర్దారణ చేయటమైనది.ఎముక, మజ్జలో క్యాన్సర్‌ ప్లాస్మా కణాలు వృద్ది చెందటం ఈ స్థితికి కారణమని,వీటిని ఆరోగ్యకరమైన రక్త కణాలతోమార్చవలసివుంటుందని” ఈ కేసు గురించి మాట్లాడిన మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడకన్పల్దెంట్‌,మెడికల్‌ అంకాలజిస్ట్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డా.జి.కృష్ణా రెడ్డి వివరించారు. ఈ కేసు గురించి డా.మాధవ్‌ దంతాల – కన్సట్టింట్‌ హెమటో అంకాలజీ,బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌, ఫిజీషియన్‌ మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు మాట్లాడుతూ “మేము అతనికి బోర్జేజోమిబ్‌, తాలిదోమిద్,డెక్సామెతాసోన్‌ లతోటి కీమోథెరపీ చేసాము. అటుతర్వాత అతనికి మెల్ఫాలాన్‌ తోటి హెచ్చు మోతాదులో కీమోథెరపీ,ఆటోలోగాస్‌ మూల కణ మార్పిడి చికిత్స చేసాము. అక్టోబర్‌-2020 వరకు అతనికి (రోగికి 8 దఫాలుగా కీమోథెరపీ,చేసాము. అటుతర్వాతమూడు వారాలకు అతనిని హాస్పిటల్‌ నుండి సురక్షితంగా ఇంటికి పంపించాము,అతను,నిరంతరం మా పర్యవేక్షణలో ఉన్నారని” చెప్పారు.ఇతని తర్వాత పశ్చిమ గోదావరికే చెందిన మరో ఇద్దరు ఇతరరోగులకు కూడ ఎముక మజ్ట మార్పిడి వస్త చికిత్సలను హాస్పిటల్‌ విజయవంతంగా నిర్వహించిచినట్లు ఆయన తెలిపారు.డా.సుధాకర్‌ కంటిపూడి – హాస్పిటల్‌ డైరక్టర్‌, మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు మాట్లాడుతూ “తమ హాస్పిటల్‌ అంతర్జాతీయ ప్రమాణాలుతో, అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ,కల్పించుటలో ముందుంటుంది. చికిత్స కొరకు హైదరాబాద్‌, బెంగుళూరు మొదలైనటువంటి నగరాలకు వెళ్ళకుండా, అనవసరమైన ఖర్చులు భారం తగ్గించుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రపంచ శ్రేణి ఆరోగ్యసంరక్షణను విజయవాడలోని మాహాస్పిటల్లో ఒకేచోట మేముఅందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అవసరమైన అన్ని సంబంధిత ఆరోగ్య సంరక్షణ వైద్యసేవలను అందిస్తున్న డాక్టర్లను,సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను,అభినందిస్తున్నాను ” .

error: Content is protected !!