మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ డిల్లీ,28సెప్టెంబర్2020:మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.”దేశానికి జశ్వంత్ జీ ఎంతో చిత్తశుద్ధితో, శ్రద్ధతో సేవలందించారు. మొదట ఒక సైనికుడిగా దేశానికి సేవలందించిన జశ్వంత్ సింగ్, తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. అటల్ బిహారీ వాజ్.పేయి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై ఆయన ఎంతో బలమైన ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం” అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.”రాజకీయాలు, సమాజం వంటి అంశాలపై జశ్వంత్ సింగ్ జీ దృక్పథం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆయనతో నా సాహచర్యం, కలసి పనిచేసిన రోజులు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం.. శాంతి.” అని ప్రధాని అన్నారు.మానవేంద్ర సింగ్ కు కూడా ప్రధానమంత్రి, ఫోన్ చేసి మాట్లాడారు. జశ్వంత్ సింగ్ జీ మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు.