రేపు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జున్ 29,2022: శ్రీనివాసమంగా పురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 3నుంచి 5వ తేదీ వరకు జరుగనున్నాయి.