365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 30,2024: ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉంది. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘డా..డా’ సినిమా ఇప్పుడు తెలుగులో ‘పా.. పా..’ పేరుతో విడుదలవుతుంది.
జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
గత సంవత్సరం, ‘డా..డా’ చిత్రం తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించారు. కోలీవుడ్‌లో ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.
డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు 30 కోట్లు వసూలు చేసి, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
తండ్రి కొడుకుల సంబంధాన్ని ప్రధానంగా చూపించే ఈ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాత నీరజ కోట తెలిపారు.
ఈ కామెడీ, భావోద్వేగం, ప్రేమను సరైన మేళవింపుతో అందించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా అన్వయించు కాబోతుందని, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ ద్వారా అచ్చిబాబు విడుదల చేయనున్నారు.
ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నీరజ కోట
హీరో: కవిన్
హీరోయిన్: అపర్ణా దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
మ్యూజిక్: జెన్ మార్టిన్
సాహిత్యం: రవివర్మ ఆకుల
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల.