Sat. Jul 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ , జూన్ 20,2024:భారతదేశపు బీమా దిగ్గజాల్లో ఒకటైన టాటా ఏఐజీ ఈ వర్షాకాలంలో వాహనాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వాహన బీమా పథకాలను అందిస్తోంది.

వర్షాకాలం రావడంతోనే, వరదలొచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ఉండేవారి వాహనాలకు నీటి సంబంధిత నష్టాల రిస్కులు పెరుగుతాయి. అయితే, ఇలాంటి సీజనల్‌పరమైన సవాళ్లను అధిగమించేందుకు విస్తృతమైన కవరేజీ, సర్వీసులతో టాటా ఏఐజీ అందించే వాహన బీమా పాలసీలతో వాహనదార్లు నిశ్చింతగా ఉండొచ్చు.

వర్షాకాలానికి సంబంధించిన రిస్కుల నుంచి సమగ్రంగా లభించే రక్షణలో ఈ కిందివి ఉంటాయి:

ఇంజిన్‌కు భద్రత: వర్షాల వల్ల నీరు చొరబడటం వల్ల గానూ లేదా ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ కారు ఇంజిన్‌ దెబ్బతింటే రక్షణ ఉంటుంది.

గ్లాస్, ఫైబర్, ప్లాస్టిక్, రబ్బర్ భాగాల మరమ్మతు: మొత్తం భాగాన్ని మార్చేయాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న డ్యామేజీలను మరమ్మతు చేయొచ్చు. తద్వారా నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ)కి కూడా ఢోకా ఉండదు.

డిప్రిసియేషన్ రీయింబర్స్‌మెంట్ కవర్: తరుగుదలపరమైన డిడక్షన్స్ ఏవీ లేకుండా భాగాలకు పూర్తి కవరేజీనివ్వడం వల్ల గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. అలాగే సమగ్రమైన రక్షణ కూడా పొందవచ్చు.

వోల్టేజీ పెరుగుదలపరమైన నష్టాల నుంచి రక్షణ: ఆర్కింగ్, సెల్ఫ్-హీటింగ్, విద్యుత్ లీకేజీ లేదా నీరు చొరబడటం వల్ల షార్ట్-సర్క్యూట్ కావడం కారణంగా తలెత్తే నష్టాన్ని లేదా డ్యామేజీని భర్తి చేస్తుంది.

ఎన్‌సీబీ ప్రొటెక్షన్ కవర్: ఎన్‌సీబీపై ప్రభావం పడకుండానే క్లెయిమ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. మీ ఎన్‌సీబీతో ప్రీమియం రెన్యువల్ సమయంలో 50 శాతం వరకు డిస్కౌంటు లభించవచ్చు.

టోయింగ్, ఆన్-రోడ్ రిపేర్: మీ కారు గానీ ఆగిపోతే ఉచిత టోయింగ్, రిపేర్ సర్వీసులను పొందవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) కవర్ వల్ల కేవలం ఒక్క కాల్ చేస్తే సహాయం సత్వరం పొందవచ్చు.

10,000+ గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్: వివిధ ప్రాంతాల్లో రిపేర్ సర్వీసులను పొందవచ్చు. తద్వారా డౌన్‌టైమ్, అసౌకర్యం తగ్గుతుంది.

99% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: ఉదంతం చోటు చేసుకున్నాకా సత్వరం రికవర్ అయ్యేందుకు విశ్వసనీయమైన, సత్వరమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ప్రక్రియ తోడ్పడుతుంది.

సులభతరంగా, సత్వరంగా పాలసీ జారీ: కేవలం మూడు దశల్లోనే పాలసీ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ సులభతరంగా, నిరాటంకమైనదిగా ఉంటుంది.

24×7 అసిస్టెన్స్: ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా సత్వరం సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటలూ ప్రత్యేక సపోర్ట్ టీమ్ అందుబాటులో ఉంటుంది. అసమానమైన కస్టమర్ సర్వీసులు అందిస్తుంది.

“వర్షాకాలంలో, ముఖ్యంగా వరదలొచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ఎదురయ్యే ప్రత్యేకమైన సవాళ్లను టాటా ఏఐజీ పరిశీలించింది. మా కస్టమర్లు ఈ సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో, నిశ్చింతగా అధిగమించేందుకు సహాయపడుతూ సమగ్రమైన రక్షణ, తోడ్పాటునిచ్చే విధంగా మా వాహన బీమా సొల్యూషన్స్ రూపొందించాయి” అని టాటా ఏఐజీ, మోటర్ ఇన్సూరెన్స్, ఆటో & యాక్చువేరియల్ అనలిటిక్స్ సీనియర్ ఈవీపీ & హెడ్ శ్రీ నీల్ ఛేడా తెలిపారు.

టాటా ఏఐజీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అయిదు కోట్ల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. గతేడాది ఒక కోటి పైగా పాలసీలు జారీ చేసింది. తద్వారా వాహన బీమా పరిశ్రమలో విశ్వసనీయమైన అగ్రగామి సంస్థగా ఉంటోంది.

మరింత సమాచారం కోసం దయచేసి www.tataaig.com లో లాగిన్ అవ్వండి.

Also read : Safeguard Your Vehicle This Monsoon with TATA AIG Motor Insurance

ఇది కూడా చదవండి : ఈ శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే..?

ఇది కూడా చదవండి :వర్షాకాలంలో బట్టలు దుర్వాసన వస్తే ఈ విధంగా తొలగించండి

ఇది కూడా చదవండి :ఛాతీ నొప్పి, గుండెపోటు లేదా కడుపులో గ్యాసా..? అని ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి :నెహ్రూ జూ పార్క్‌ను తరలిస్తున్నారా..? అటవీశాఖ అధికారులు ఏమంటు న్నారు..?