365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, అక్టోబర్ 24,2024: భారతదేశంలోని అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వైద్య ఖర్చుల పెరుగుదల, ఆరోగ్య సంరక్షణ అవసరాల మార్పుల నేపథ్యంలో 60 పైగా ప్రయోజనాలను అందించే అయిదు కొత్త రైడర్లను ఆవిష్కరించింది.
ఈ రైడర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి, తద్వారా సరికొత్త ఆందోళనలు, జీవన విధాన మార్పుల సమస్యలను పరిష్కరించవచ్చు. ఆరోగ్య బీమా రంగంలో పురోగతి సాధించడంపై టాటా ఏఐజీ గల నిబద్ధతను ఈ ఆవిష్కరణలు స్పష్టంగా తెలియజేస్తాయి.
కొత్త రైడర్లు:
మెంటల్ వెల్‌బీయంగ్: మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పునరావాసం, స్క్రీనింగ్స్‌ను కలిగి ఉంది.
ఎంపవర్‌హర్ (EmpowerHer): మహిళల ఆరోగ్య సమస్యలు, వంధ్యత్వం, పీసీవోఎస్ వంటి అంశాలకు సమగ్రమైన పరిష్కారాలు అందించడానికి రూపొందించింది.
క్యాన్‌కేర్ (CanCare): క్యాన్సర్‌కు సంబంధిత కవరేజీని అందిస్తుంది.
ఓపీడీ కేర్: డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ ఖర్చులు వంటి అవుట్‌పేషంట్ ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.
ఫ్లెక్సీ షీల్డ్ (Flexi Shield): వైద్య ద్రవ్యోల్బణం నుంచి పాలసీదారులను రక్షించేందుకు రూపొందించింది.
మెరుగైన క్లెయిమ్స్ ప్రక్రియ: క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియను టాటా ఏఐజీ గణనీయంగా మెరుగుపరచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.7% క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వినియోగం, 2024-25లో 76.95%కి చేరుకుంది.
96% క్యాష్‌లెస్ క్లెయిమ్స్ నాలుగు గంటల్లో ప్రాసెస్ చేస్తున్నాయి. 85% రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ అయిదు రోజుల వ్యవధిలో సెటిల్ చేయబడుతున్నాయి.
నెట్‌వర్క్ విస్తరణ: టాటా ఏఐజీ 11,700 పైగా నెట్‌వర్క్ ఆస్పత్రులతో తన కార్యకలాపాలను విస్తరించింది. 64% పెరుగుదలతో, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కట్టుబడి ఉంది. 5,000 పైగా డాక్టర్లు,3,000 పైగా డయాగ్నోస్టిక్ ప్రొవైడర్లు ఉన్న ఓపీడీ నెట్‌వర్క్, 10 పైగా భాషల్లో పటిష్టమైన టెలీకన్సల్టేషన్ సేవలను అందిస్తుంది.
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్-ఏజెన్సీ ప్రతీక్ గుప్తా తెలిపారు, “మా వ్యూహంలో భాగంగా ఈ రైడర్లు ఆవిష్కరించాయి. ద్వితీయ,తృతీయ పట్టణాలలో విస్తరించడంపై మేము మరింత దృష్టి పెడుతున్నాం. ఈ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ వేగంగా పెరుగుతోంది.”
రైడర్ల ప్రత్యేకతలు:
ఎంపవర్‌హర్: మహిళల ఆరోగ్య సమస్యలకు సమగ్ర కవరేజీ, ప్రివెంటివ్ కేర్.
మెంటల్ వెల్‌బీయింగ్: మానసిక ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్స్, రీహాబిలిటేషన్ కవరేజీ.
క్యాన్‌కేర్: క్యాన్సర్‌కు సంబంధిత కవరేజీ.
ఓపీడీ కేర్: రోజువారీ ఆరోగ్య ఖర్చుల కవరేజీ.
ఫ్లెక్సీ షీల్డ్: వైద్యపరమైన ద్రవ్యోల్బణం నుంచి రక్షణ.
టాటా ఏఐజీ, 220 ప్రాంతాలలో,11,700+ ఆస్పత్రుల నెట్‌వర్క్‌తో ఆరోగ్య బీమా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉంది.