Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaignTata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign
Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign
Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్‌ 13, 2021:భారతదేశపు ప్రీమియర్‌ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ వేదిక టాటా క్లిక్‌ లగ్జరీ నేడు తమ తాజా బ్రాండ్‌ ప్రచారం, ద లగ్జ్‌ లైఫ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో కల్కీ కొచ్లిన్‌ నటించారు. లగ్జరీ షాపింగ్‌ వెనుక ఉన్న ఆలోచనాత్మకతను ప్రధానంగా ఈ చిత్రం ద్వారా వెల్లడించనున్నారు. అదే సమయంలో ఈ వేదిక పట్ల అవగాహననూ కల్పించనున్నారు. పనితనం, సంప్రదాయం, వంటి అంశాల పట్ల శ్రద్ధ చూపే రీతిలో ఇది ఉంటూనే లగ్జరీ కోసం షాపింగ్‌ చేస్తున్నప్పుడు అనుభవం , విలువనూ తెలుపుతుంది. ఈ ప్రచారం ద్వారా స్లో లగ్జరీ నేపథ్యమూ వివరించనున్నారు. టాటా క్లిక్‌ లగ్జరీ , స్లో కామర్స్‌ సిద్ధాంతంను ఇది వెల్లడించడంతో పాటుగా ఈ నేపథ్యంను స్వీకరించడం పట్ల వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. డిజిటల్‌ ఫస్ట్‌ వ్యూహంలో భాగంగా, ఈ బ్రాండ్‌ చిత్రంను విస్తృతంగా భారీ స్ధాయి ప్రచారాల ద్వారా పలు డిజిటల్‌ వేదికలు , ఆఫ్‌లైన్‌ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నారు.

నేడు వినియోగదారులు బ్రాండ్లు,పలు వేదికలను సన్నిహితంగా పరిశీలిస్తుండటంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అవకాశాలను వారు కనుగొనగలుగుతున్నారు. అవి వారి వ్యక్తిగత విలువ వ్యవస్ధలను ప్రతిబింబించడంతో పాటుగా మారుతున్న వారి అభిరుచులనూ ప్రతిబింబిస్తున్నాయి. ఈ అంశాలకనుగుణంగానే టాటా క్లిక్‌ లగ్జరీ , ప్రచారంలో ఇది ఏ విధంగా ప్రశాంతమైన, లీనమయ్యే, ఆలోచనాత్మక షాపింగ్‌ అనుభవాలను నాణ్యత, పనితనం వంటి అంశాలపై దృష్టి సారించి అందిస్తుందనేది తెలిపారు.

Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign
Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign

ఈ బ్రాండ్‌ చిత్రంలో కల్కీ కొచ్లిన్‌ , స్లో లగ్జరీ ఆనందాన్ని ఆస్వాదిస్తూ కనబడతారు. ఆమె టాటా క్లిక్‌ లగ్జరీ యాప్‌ ద్వారా బ్రౌజ్‌ చేస్తూనే కొనుగోలు చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆలోచనాత్మకత, నాణ్యత విలువలను ప్రదర్శిస్తూనే, వేగవంతంగా వెళ్లి పోవడం కాదు, సమయం తీసుకున్నప్పటికీ చక్కటి అంశాలను అభినందించడం, మన మనో భావాలను మించి మహోన్నతంగా మాట్లాడే అంశాలను ఎంచుకోవడం, వేగాన్ని తగ్గించి , అనుభవాలను ఆస్వాదించడం వంటి అంశాలను వెల్లడిస్తుంది. ఈ కథనంలో టాటా క్లిక్‌ లగ్జరీ యొక్క వైవిధ్యమైన ఫీచర్లు సైతం ఉంటాయి. వీటిలో విస్తృతశ్రేణి విభాగాలు, అందించే కలెక్షన్స్‌, యాప్‌పై సౌకర్యవంతమైన షాపింగ్‌ అనుభవాలు, లగ్జరీ ప్యాకేజింగ్‌, వైట్‌ గ్లోవ్‌ సేవలను సైతం వెల్లడిస్తుంది.

ఈ ప్రచారం గురించి మొహువా దాస్‌ గుప్తా, హెడ్‌ –బ్రాండ్‌ మార్కెటింగ్‌, టాటా క్లిక్‌ లగ్జరీ మాట్లాడుతూ ‘‘నూతన లగ్జరీ ప్రపంచం సంప్రదాయ ప్రమాణాలకు ఆవల ఉంటుంది. నేడు వినియోగదారులు తమ ఖర్చు అలవాట్ల పరంగా ఆప్రమప్తతతో ఉండటంతో పాటుగా తమ విలువ వ్యవస్థలను ప్రతిబింబించే రీతిలో ఉత్పత్తులు, బ్రాండ్లు ఉండాలని కోరుకుంటున్నారు. టాటా క్లిక్‌ లగ్జరీ వద్ద, దీనిని మేము గుర్తించాము మరియు వినియోగదారులు క్యూరేటెడ్‌ ఎంపికలను కనుగొనేలా తోడ్పడుతున్నాం. ఇవి వారి మారుతున్న అభిరుచులకు ప్రాధాన్యత నివ్వడంతో పాటుగా జీవితంలో అతి సూక్ష్మ అంశాలను సైతం ప్రశంసిస్తుంది. లగ్జ్‌ లైఫ్‌ ప్రచారంతో, మేము స్లో లగ్జరీ టు లైఫ్‌ నేపథ్యంను తీసుకువస్తున్నాం. ఇది టాటా క్లిక్‌ లగ్జరీ ని అత్యుత్తమ ఉత్పత్తులు మరియు విలాసం కోసం అనుకూలమైన షాపింగ్‌ కేంద్రంగా నిలుపుతుంది. ఇక్కడ బ్రౌజింగ్‌ ఆహ్లాదకరమైనది మరియు నాణ్యత పెంపొందించబడినది’’ అని అన్నారు.

Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign
Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign

నటి, రచయిత కల్కీ కొచ్లిన్‌ మాట్లాడుతూ ‘‘మీరు జీవితాంతం ఓ నిధిలా అపూర్వంగా చూసుకునే అంశాలేవీ కూడా హడావుడిగా ఎంచుకోకూడదని నేను నమ్ముతాను. కాలాతీతంగా అవి ఉండాలంటే కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కారణం చేతనే టాటా క్లిక్‌ లగ్జరీని నేను అభిమానిస్తున్నాను. స్లో–కామర్స్‌ నేపధ్యంను ఇది ఎల్లప్పుడూ వృద్ధి చేయడంతో పాటుగా అనుభవ పూర్వక విలాసాన్నీ అందిస్తుంది. అదే సమయంలో సౌకర్యవంతమైన షాపింగ్‌ అనుభవాలనూ అందిస్తుంది’’ అని అన్నారు.

బాబీ పవార్‌, ఛైర్మన్‌ అండ్‌ చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌, హవాస్‌ గ్రూప్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘హవాస్‌ వద్ద మేమెప్పుడూ కూడా అర్థవంతమైన బ్రాండ్లు,సంభాషణలను నేటి తరపు వినియోగదారుల కోసం సృష్టిస్తుంటాం. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లను అర్థం చేసుకుని, నిర్వహించడంతో పాటుగా ఈ–కామర్స్‌ రంగంను అర్థం చేసుకున్న బ్రాండ్ల కోసం టాటా క్లిక్‌ లగ్జరీ వెదుకుతుంది. స్లో కామర్స్‌ ఆలోచనను నిర్మించడంతో పాటుగా అనుసంధానిత, ప్రభావవంతమైన కథనంను ఆన్‌లైన్‌ షాపింగ్‌ జెనర్‌లో సృష్టించడం అత్యంత సవాల్‌తో కూడిన అంశం. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనేది అత్యంత వేగవంతమైనది, ఆకస్మికమైనది, ఆన్‌లైన్‌ లగ్జరీ విభాగం కోసం పూర్తి సరికొత్త టార్గెట్‌ గ్రూప్‌ హ్యాబిట్‌ను కలిగి ఉంది. ఈ లగ్జ్‌ లైఫ్‌ చిత్రాన్ని హవాస్‌ వరల్డ్‌ వైడ్‌ ఇండియా సృష్టించింది. కల్కీ ఈ చిత్రంలో కనిపిస్తారు. లగ్జరీకి ప్రతిరూపంగా కనిపించే ఆమె ఈ ఆలోచనను ప్రతిధ్వనించడంతో పాటుగా టాటా క్లిక్‌ లగ్జరీని ఆధీకృత, ఆన్‌లైన్‌ లగ్జరీ షాపింగ్‌కు అత్యుత్తమ కేంద్రంగా నిలుపుతుంది.త్వరలోనే మిగిలిన డిజిటల్‌ చిత్రాలను విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.

Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign
Tata CLiQ Luxury immerses audiences in the experience of ‘Slow Luxury’ with its new #TheLuxeLife campaign

అత్యంత జాగ్రత్తగా బ్రాండ్లను ఎంచుకోవడం, ఆలోచనాత్మకంగా బ్రాండ్‌ స్టోర్లను అభివృద్ధి చేయడం, లగ్జరీ డెలివరీ,అన్‌బాక్సింగ్‌ అనుభవాలు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు నిర్వహించే ప్రివిలేజ్‌ కార్యక్రమాల ద్వారా సాటిలేని షాపింగ్‌ అనుభవాలను టాటా క్లిక్‌ లగ్జరీ అందిస్తుంది.