365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగస్టు 4,2024: సెమీకండక్టర్ రంగం భవిష్యత్తుకు పునాది కానుందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్. నిత్య జీవితంలో చాలా విషయాల్లో చిప్స్ ఉండే భవిష్యత్తు రాబోతోందని అన్నారు.
అస్సాంలోని మోరిగావ్‌లో ప్రారంభం కానున్న సెమీకండక్టర్ యూనిట్ భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం ఆయన స్పందించారు.
అస్సాంలో 27,000 కోట్ల సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 27,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 13,000 మందికి ఉపాధి లభిస్తుంది.
యూనిట్ నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని, అదే సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు టాటా గ్రూప్ తెలిపింది.
ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మొబైల్ టెక్నాలజీ, డిఫెన్స్,హెల్త్‌కేర్ వంటి వివిధ రంగాల్లో చిప్‌ల వినియోగం పెరిగే భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నాం. ఈ పరిస్థితిలో సెమీకండక్టర్ పరిశ్రమ చాలా ముఖ్యమైనదని టాటా గ్రూప్ చైర్మన్ అన్నారు.
అసోంలో రోజుకు 4.83 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించబోతు -న్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణమ్ కూడా స్పందించారు.
ఇదికూడా చదవండి: మహీంద్రా కొత్త రేసర్-స్టైల్ క్యాబిన్ కారు ఫీచర్స్..
ఇదికూడా చదవండి: అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్.. స్మార్ట్ ఫోన్ల పై భారీగా తగ్గింపు..