365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూ ఢిల్లీ,జనవరి 21,2026: భారతీయ రవాణా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో టాటా మోటార్స్ తన నూతన పోర్ట్‌ఫోలియోను ప్రకటించింది. యూరోపియన్ భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ వాహనాలు అటు రవాణాదారులకు లాభాలను, ఇటు డ్రైవర్లకు రక్షణను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.
అజురా (Azura) సిరీస్: తేలికపాటి వాహనాల్లో కొత్త ఒరవడి
మధ్యస్థ,తేలికపాటి వాణిజ్య వాహనాల (ILMCV) విభాగంలో ‘అజురా’ సిరీస్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.
ఇంజిన్: శక్తివంతమైన 3.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇవి పనిచేస్తాయి.
శ్రేణి: 7 టన్నుల నుంచి 19 టన్నుల వరకు వివిధ కాన్ఫిగరేషన్‌లలో లభ్యం.
సౌకర్యం: డ్రైవర్ల అలసటను తగ్గించేలా ‘వాక్‌త్రూ’ క్యాబిన్, రిక్లైనింగ్ సీట్లు,విశాలమైన ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశారు.
వినియోగం: ఇ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ వస్తువుల రవాణాకు ఇవి అత్యంత అనుకూలం.
ఇదీ చదవండి..తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యలు: నిబంధనల ఉల్లంఘనపై జంతు సంక్షేమ సంస్థల ఆగ్రహం..
ఇదీ చదవండి..రోగ నిర్ధారణలో ఐసీఎంఆర్ సరికొత్త విప్లవం.. ఒక్క పరీక్షతో పది రకాల ఇన్ఫెక్షన్స్..
Tata Trucks.ev: ఎలక్ట్రిక్ విప్లవం
సున్నా ఉద్గారాలే లక్ష్యంగా I-MOEV (ఇంటెలిజెంట్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్) ఆర్కిటెక్చర్ ఆధారంగా ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రారంభించింది.
అల్ట్రా ఈవీ: పట్టణ ప్రాంతాల్లో పంపిణీకి అనువైన లైట్ ట్రక్కులు.
ప్రైమా E.55S: భారీ లోడ్లను మోసే హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ ప్రైమ్ మూవర్.
ప్రైమా E.28K టిప్పర్: మైనింగ్,నిర్మాణ రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ టిప్పర్.
Read this also..AssetPlus Raises ₹175 Crores to Build the Future of Assisted Wealth Management in India, led by Nexus Venture Partners.
ఇదీ చదవండి..జూబ్లీ హిల్స్‌లో తమ 20వ క్లినిక్ ‘లేయర్స్ ప్రైవ్’ బ్రాంచ్ ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్..
యూరోపియన్ క్రాష్ సేఫ్టీ ప్రమాణాలకు (ECE R29 03) అనుగుణంగా క్యాబిన్లను నిర్మించిన ఏకైక భారతీయ కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. వీటిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి 23 రకాల అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

లాభదాయకతకు పెద్దపీట
కొత్త ఇంజిన్ల వల్ల ఇంధన సామర్థ్యం 7% పెరిగింది.
పేలోడ్ సామర్థ్యం 1.8 టన్నుల వరకు అదనంగా పెంచబడింది.
ఫ్లీట్ ఎడ్జ్ (Fleet Edge): డిజిటల్ సేవల ద్వారా వాహనం ఎక్కడుంది, దాని ఆరోగ్యం ఎలా ఉంది అనే అంశాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు.
“భారతదేశ లాజిస్టిక్స్ రంగం వేగంగా మారుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా, సుస్థిరమైన ,సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే మా ప్రాధాన్యత.” — గిరీష్ వాఘ్, ఎండీ, టాటా మోటార్స్.
