tata Punch EV

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే13,2023: టాటా మోటార్స్ భారత మార్కెట్లోకి పంచ్ ఈవీని విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ కారును ట్రయల్ రాం కూడా వేశారు. ఐతే సరికొత్త ఫీచర్లతో దీన్ని ప్రవేశపెట్టనున్నట్టు అంచనా.

దీని ఎక్ట్సీరియర్ పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇప్పటికే ఉన్న టాటా పంచ్ ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది.

tata Punch EV

ఇది ICE సెటప్ నుంచి ఎలక్ట్రిక్ లేఅవుట్‌కు మారడానికి గణనీయమైన మార్పులు అవసరం లేదు.

టాటా పంచ్ EV జూన్‌లో ఉత్పత్తిలోకి వస్తుందని, పండుగ సీజన్‌లో లాంచ్ చేయనున్నట్లు భావిస్తున్నారు. నెక్సాన్ తర్వాత పంచ్ ప్రస్తుతం టాటా రెండవ అత్యధికంగా అమ్ముడైన కారు. టాటా పంచ్ EV ధర రూ. 9.5 లక్షల నుంచి రూ. 10.5 లక్షల మధ్య ఉండొచ్చు.