Fri. Jan 10th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 9,2025: భారతదేశంలోని ప్రముఖ డైరెక్ట్ టు హోమ్ (DTH) ప్రొవైడర్ టాటా ప్లే, కొత్త ఏడాది, పంటల, పండగల సీజన్‌ను పురస్కరించుకుని ‘సిర్ఫ్ లగే మెహెంగా’ (అనుకునేందుకేధరఎక్కువ) కేవలం అనే సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

కుటుంబంలోని ప్రతి సభ్యుని ఎంపికలకు అనుగుణంగా, వినోదం, వార్తలు, క్రీడలు, సంగీతం, సినిమాలు, భక్తి, కిడ్స్, తదితర కళా ప్రక్రియలతో సహా విస్తృతమైన, బడ్జెట్-ఫ్రెండ్లీ, అధిక నాణ్యతతో కూడిన వినోద అనుభవాన్ని టాటా ప్లే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అందిస్తుంది.

ఓగిల్వీ తెరకెక్కించిన ‘సిర్ఫ్ లగే మెహెంగా’ క్యాపెయిన్‌ను డీటీహెచ్ (DTH)సేవలు ఖరీదైనవి అనే అపోహను హాస్యాస్పదంగా తొలగించే ఓవర్‌స్టేట్‌మెంట్ పేరడీ చిత్రాల శ్రేణిని ప్రదర్శిస్తుంది. టాటా ప్లే ప్రపంచ స్థాయి వినోదాన్ని సరసమైన ధరకు ఎలా అందజేస్తుందో, రాజీలేని వీక్షణ అనుభవాన్ని ఎలా అందజేస్తుందో ఈ వాణిజ్య ప్రచార చిత్రాలు హైలైట్ చేస్తాయి.

ఒత్తిడితో గోళ్లు కొరికే పరిస్థితులల్లోనూ హాస్యాన్ని పండించడం ద్వారా, టెలివిజన్‌లో అందుబాటులో ఉండే అసలైన, ప్రీమియం వినోదాన్ని కనుగొనడంలో ఉన్న ఆనందాన్ని ఈ వాణిజ్య చిత్రాలు వివరిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆకర్షించేందుకు వివిధ భాషల్లో ఈ క్యాంపెయిన్‌ అందుబాటులోకి వచ్చింది.

టాటా ప్లే భౌగోళికాలు, శ్రేణులు, ప్రాంతాలు, విభాగాల వ్యాప్తంగా ప్రేక్షకులకు విలువ-ఆధారిత వినోదాన్ని అందించడంలో సరికొత్త కొలమానాలను సెట్ చేస్తూనే ఉంది.

నెలకు రూ.255తో ప్రారంభమయ్యే ప్యాక్‌లతో, వీక్షకులు టాటా ప్లే వెబ్‌సైట్‌ని https://www.tataplay.com/సందర్శించడం ద్వారా లేదా టాటా ప్లేమొబైల్ యాప్‌లోని నిర్వహణ విభాగాన్ని సందర్శించడం ద్వారా వారి ప్యాక్‌లను మార్చుకోవచ్చు లేదా ఎంచుకోవచ్చు. ఆఫర్‌ను పొందేందుకు వారు తమ ప్రాంతంలో సమీపంలో ఉన్న డీలర్లను కూడా సందర్శించవచ్చు.

error: Content is protected !!