365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగస్టు30, 2025 : దేశంలో వాణిజ్య వాహనాల విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్.. మరో కొత్త వాహనంతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రత లక్ష్యంగా 9 సీటర్ల టాటా వింగర్ ప్లస్ (Tata Winger Plus) ను లాంచ్ చేసింది. పర్యాటకులు, ఉద్యోగుల రవాణా అవసరాలను తీర్చేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ఫీచర్లు, ఇంజన్, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
టాటా వింగర్ ప్లస్ విశేషాలు
ఈ వాహనాన్ని మోనోకాక్ ఛాసిస్ (Monocoque Chassis) పై నిర్మించారు. దీనివల్ల ప్రయాణికులకు ఇది అధిక భద్రత, స్థిరత్వాన్ని అందిస్తుంది.

అందుబాటులో ఉన్న ఫీచర్లు..
9 సీటర్ల సామర్థ్యం
అడ్జస్టబుల్ ఆర్మ్‌రెస్ట్‌లు, రెక్లైనింగ్ క్యాప్టెన్ సీట్లు
ప్రతి సీటుకు ప్రత్యేకంగా యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు
వ్యక్తిగత ఏసీ వెంట్స్
విశాలమైన లెగ్ స్పేస్
శక్తివంతమైన ఇంజన్:
టాటా వింగర్ ప్లస్‌లో 2.2 లీటర్ల సామర్థ్యం గల డైకోర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 100 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ వాహనం లాంచ్‌పై టాటా మోటార్స్ కమర్షియల్ ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ ఎస్ మాట్లాడుతూ.. “వంగర్ ప్లస్ వాహనాన్ని ప్రయాణికులకు గొప్ప అనుభవాన్ని అందించేందుకు రూపొందించాం. ఫ్లీట్ ఆపరేటర్లకు ఇది లాభదాయకమైన ఎంపిక.
Read This also…Affordable housing gap widens; India builds just 0.36 homes for every unit of sale: Knight Frank India..
దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక లాభాలను ఆర్జించేలా దీనిని డిజైన్ చేశాం. దేశవ్యాప్తంగా పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఇది ప్రయాణికుల రవాణాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
ధర ఎంత..?
టాటా వింగర్ ప్లస్‌ను భారతదేశంలో ₹20.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేశారు.
