Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై ,అక్టోబర్ 28,2021:యశ్ రాజ్ ఫిలింస్ వారి బంటి ఔర్ బబ్లి-2 ప్రపంచ వ్యాప్తంగా 19, నవంబరు, 2021లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుండగా, ఇది పూర్తిగా హాస్య చిత్రంగా కాగా, మోసగాళ్లయిన ఇద్దరు కేటుగాళ్ల రెండు తరాల బంటి  బబ్లి పరస్పరం ఒకరిపై ఒకరు గెలిచేందుకు పోటీ పడుతూ ఉంటారు! సైఫ్ అలి ఖాన్, రాణి ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది అందమైన కొత్త నటి శార్వరి నటించిన ఈ చిత్రం పూర్తి కుటుంబ కథా మనోరంజన చలన చిత్రం కాగా, మొదటి పాట టాట్టూ వాలియే విడుదల చేసేందుకు సిద్ధం కాగా, అది మహమ్మారి సమయంలో భారతదేశపు చిత్రపరిశ్రమలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పెద్ద పాటగా నిలిచింది.

సైఫ్ అలి ఖాన్ మాట్లాడుతూ, ‘‘టాట్టూ వాలియే ప్రజలు చూసే మొదటి పాట. మేము ఈ పాటను ముందుగా నిర్ణయించినట్లే, పెద్ద ప్రమాణంలో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకున్నాము. తక్షణమే చార్ట్‌బస్టర్ అయ్యే పాటను చిత్రీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. చితీరకరణకు ముందుగా చాలా పూర్వాభ్యాసం చేశాము. అంతా సిద్ధం అనుకున్న సమయంలో మార్చి 2020లో చిత్రీకరణ
చేసుకోవలసిన రోజే దురదృష్టవశాత్తు దేశం లాక్‌డౌన్ అయింది! అది వాస్తవానికి సంకటంతో కూడిన విషయం’’ అని తెలిపారు.

‘‘ఒక ఏడాది మొత్తం సెట్ విప్పదీయకుండా అలాగే ఉంచినందుకు ఆది వైఆర్‌ఎఫ్‌కు చెందిన పూర్తి బృందానికి అభినందనలు! ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ వారి నమ్మకాన్ని కొనసాగించడం చాలా కష్టమైనప్పటికీ,  మేము వారిని విశ్వసించాము. అవసరమైన కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము చిత్రీకరణ చేయగలమని ప్రకటించినప్పుడు మేము దానికి వెనుదిరిగేందుకు మరియు ఈ పాటను చిత్రీకరించేందుకు చాలా ఉత్సుకతతో ముందుకు
వెళ్లాము! దానితో టాట్టూ వాలియే చూసినప్పుడు అది మహమ్మారి సందర్భంలో చిత్ర పరిశ్రమలో చిత్రీకరణ చేసుకున్న అత్యంత పెద్ద పాటగా నిలిచింది. అటువంటి కష్ట సమయంలో మరే ఇతర చలన చిత్రం కోసం అటువంటి పాటను చిత్రీకరించలేదు’’ అని వివరించారు.

రాణి మాట్లాడుతూ ‘‘ఆ రోజును నేను ఇప్పటికీ స్పష్టంగా గుర్తు చేసుకోగలను. టాట్టూ వాలియే సెట్‌కు చిత్రీకరణకు వెనుదిరిగేందుకు మేము చాలా ఉత్సాహంతో ఉన్నాము. నిజం చెప్పాలంటే మా మనసులో సందేహాలు తలెత్తాయి. అయితే యశ్ రాజ్ ఫిలింస్ పూర్తి ఆవరణను చక్కగా శానిటైజ్ చేసి, ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్ష చేయించి, అన్ని రకాల ముందు జాగ్రత్తలను తీసుకుంది. మేము చిత్రీకరణ ప్రారంభించేందుకు 14 రోజుల ముందుగా ప్రతి ఒక్కరినీ హోటల్‌లో క్వారంటైన్ కూడా చేశారు! దానితో, సెట్‌లో మేమంతా అనుకూలంగా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించారు.

సిద్ధాంత్ మాట్లాడుతూ, ‘‘మేమంతా లోపల లాక్ అయ్యాము. మేము చిత్రీకరణ పూర్తయ్యేంత వరకు ఇంటికి వెళ్లకూడదు. చిత్రీకరణ రోజు ప్రతి ఒక్కరికీ నెగటివ్ నివేదిక రావడం మా అందరికీ సంతోషం కలిగింది! ఆ సందేశం చిత్ర బృందం అందరికీ వాస్తవంగా సకారాత్మక ప్రభావాన్ని చూపించింది. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఎక్కువై, పాట చిత్రీకరణలో అత్యుత్తమంగా శ్రమించాలని తీర్మానించారు. టాట్టూ వాలియే చిత్రీకరణ చిత్రపరిశ్రమ పునశ్చేతనలో ఒక అడుగు కాగా, మేము
చాలా ఉత్సాహంగా దాని కోసం పని చేశాము. దానితో టాట్టూ వాలియే వాస్తవంగా ప్రత్యేక పాటగా నిలిచింది. ఎందుకంటే, మేమెంత కష్టాన్ని ఎదుర్కొన్నామో అది మా అందరికీ తెలుసు’’ అని అన్నారు.

శార్వరి మాట్లాడుతూ, ‘‘టాట్టూ వాలియే ఇప్పుడు విడుదల కావడం కొంచెం అతి వాస్తవికం అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొవిడ్-19 లాక్‌డౌన్‌ నుంచి చిత్రీకరణ నిలిచిపోవడం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. నేడు నాపై చితీరకరించిన సంతోషపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను. చిత్రీకరణ అనంతరం పరస్పరం మేము చూసిన దానికి చాలా భావుకులం అయ్యాము. మేము సెట్‌లో
ఉండటాన్ని తప్పించుకున్నాము. మరోసారి చిత్రీకరణ పారరంభమైనప్పుడు మేమంతా పరస్పరం ఒక్కచోటకు చేరడం సంతోషాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ టాట్టూ వాలియేను చిత్రీకరించే సమయంలో మేము ఎంత ఇష్టపడ్డామో, అంతే ప్రేక్షకులూ ఇష్టపడతారన్న నమ్మకం మాకుఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. టాట్టూ వాలియే పాటను చార్ట్‌బస్టర్ల రాణి అయిన నేహా కక్కర్, పర్‌దీప్ సింగ్ శ్రణ్ పాడగా,
అది నేడు విడుదలైంది.

error: Content is protected !!