365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 24,2024:రేపటి సమాజ సారథులను తయారు చేసేది ఉపాధ్యాయులే అని లయన్స్ జిల్లా గవర్నర్ 320ఎ డా. డి.కోటేశ్వరరావు అన్నారు . ఇంటర్నేషనల్ లయన్స్ క్వెస్ట్ ఆధ్వర్యంలో జిల్లా లయన్స్ క్వెస్ట్ చైర్ పర్సన్ వి.మాధవరావు శ్రీ భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్ హస్తినాపురం లో 30 మంది టిచర్స్ కి “2” రోజులు ఉచితం గా “టిచర్ ట్రైనింగ్ వర్క్ షాప్” నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో అత్యున్నత స్థానం ఉపాధ్యాయులదేనన్నారు.
ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితాలను మార్చగల శక్తివంతమైన వ్యక్తి అన్నారు. అందుకే, వారి ప్రవర్తన, వారి పాత్ర, మంచి ఉపాధ్యాయుడుగా ఉండడానికే ఈ టిచర్ ట్రైనింగ్ వర్క్ షాప్” అని అన్నారు. ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి కాదని , ఈ ప్రపంచానికే ఆదర్శవంతమైన మార్గదర్శకుడని తెలిపారు.
విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా వారిలో నమ్మకం పెరుగుతుందని చెప్పారు.
మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ *డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రేమించాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రత్యేకమైనవాడని వారిని వ్యక్తిగతంగా గుర్తించి, వారికి ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఒక రోల్ మోడల్ అన్నారు.
విషయావగాహనతో పాటు విలువలు కూడా నేర్పించాలి న్నారు. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలని చెప్పారు. ఫ్యాకల్టీ రేణుక కొండపల్లి ట్రైనింగ్ ఇవ్వగా విద్యార్థులకు ధైర్యాన్ని, మనః స్థైర్యాన్ని, స్ఫూర్తిని అందించాల్సింది టిచర్స్ అని అన్నారు.
యాదయ్య గౌడ్, గోవింద రాజు, శివ ప్రసాద్, మోహన్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్. శ్రీనివాస్, మైఖేల్,డా.హిప్నో పద్మా కమలాకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.