Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 18,2023:తెలంగాణ లోని ఇటిక్యాల్‌లో రోడ్ షో సందర్భంగా BRS MLC కవిత స్పృహతప్పి పడిపోయారు.

డీహైడ్రేషన్ కారణంగా ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కవిత బృందం తెలిపింది. అయితే,కొద్ది సేపటి తర్వాత, రోడ్‌షో మళ్లీ కొనసాగించిన కవిత.

119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30 కాగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆసక్తికర త్రిముఖ పోటీ జరగనుంది.