365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 28,2022: తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు కొత్తటెక్నాలజీని ఉపయోగించ నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. ఏ మారుమూల ప్రాంతంలో ఎటువంటి నేరాలు జరిగినా చిటికెలో ఆయా సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిద్ధం చేశారు. ఈ సెంటరు ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేర్ రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విష్యం తెలిసిందే. ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

ఆయా పనులను గురించి తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ చివ రిదశ పనులను పరిశీ లించారు. మెయిన్ ఎంట్రన్స్, పోర్టీకో, గ్రాండ్ ఎంట్రీ,మ్యూజియం, ఆడిటోరియం,ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు. మిగిలిన ఫినిషింగ్ పనులు మ్యాన్ పవర్ పెంచి ప్రారంభోత్సవం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం అనంతరం 14వ అంతస్తు నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.