365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 27,2025: గూగీ గ్రూప్ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ ఐకాన్ షఫీ సామి నిర్వహిస్తున్న తెలంగాణ ఫిట్‌నెస్ ఫెస్టివల్ పోస్టర్‌ను TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఇంచార్జ్ ఉస్మాన్ అల్హజ్రీ ,మలక్‌పేట్ ఇంచార్జ్ షేక్ అక్బర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

ఈ ఫిట్‌నెస్ ఫెస్టివల్ ఫిబ్రవరి 9న హైదరాబాద్ LB అవుట్‌డోర్ స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఆరోగ్యం,ఫిట్‌నెస్ పై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఫిట్‌నెస్ ప్రియులు, అథ్లెట్లు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

మీ కాలెండర్లలో ఫిబ్రవరి 9ను గుర్తించండి, ఫిట్‌నెస్‌కు అంకితమైన ఈ మహోత్సవానికి హాజరుకండి.