Sun. Dec 22nd, 2024
Telangana Government Doctors Association

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30,2022: తెలంగాణ ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ “బి” కేటగిరి సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్ లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి ఫలాలను భవిష్యత్ తరాల వారు అందుకోవడం, తెలంగాణలోని ఎంతో మంది వైద్య విద్య ద్వారా డాక్టర్ కావాలనే కోరిక నెరవేరుతుందని చెప్పారు.

Telangana-Government-Doctors

వైద్యుల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ఎన్నోసార్లు పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి జీవో జారీ చేయడం అభినందించదగిన విషయమన్నారు. దీనివల్ల దాదాపు 24 కాలేజీల్లో 1064 మంది యువ వైద్యులు రానున్నారని తెలిపారు.

ఇంకా కొన్ని కాలేజీలలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైద్యులు ఉన్నారని, వివిధ ప్రభుత్వ సూపరింటెండెంట్ పోస్టులు , వివిధ జిల్లాలలోని పోస్టులు తెలంగాణ వారికి దక్కాలని అన్నారు. పీజీ సీట్ల పెంపు విషయంలో కూడా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డి.హెచ్ పరిధిలోని వైద్యుల టైం బౌండు ప్రమోషన్ల జీవోలు విడుదల చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ అన్నారు.

error: Content is protected !!