Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 24, 2024: తెలంగాణ రాష్ట్రం సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది అని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఆయన వోక్స్సెన్ యూనివర్సిటీ నిర్వహించిన ఫ్యూచర్ టెక్ సమ్మిట్ 2024లో గౌరవ అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవరీవన్’ అనే నేపథ్యంతో గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా ఏఐను ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించడంపై మేము దృష్టి సారించాం. తెలంగాణ ప్రత్యేకంగా ఏఐ పరిష్కారాలను అన్వేషించడానికి, వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది,” అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, పంట నష్టాలను తగ్గించేందుకు, మారుమూల ప్రాంతాల్లో వైద్యం మెరుగుపరచడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించేందుకు ఏఐ పరిష్కారాలను అన్వేషిస్తోందని తెలిపారు.

స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి టెక్నాలజీ ద్వారా సమాజానికి మంచిని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

వోక్స్సెన్ యూనివర్సిటీ ఫ్యూచర్ టెక్ సమ్మిట్ 2024లో ఆవిష్కరణ, పురోగతిని నడిపించడంలో ఏఐ కీలక పాత్రను చర్చించారు. ఈ సమ్మిట్ ప్రత్యేకంగా ఉత్పాదక ఏఐ, శక్తి-సమర్థవంతమైన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.

వోక్స్సెన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రౌల్ విల్లామరిన్ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ, “ఫ్యూచర్ టెక్ సమ్మిట్ 2024 ద్వారా ఏఐ అపారమైన అవకాశాలను అన్వేషించడం మా లక్ష్యం. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా మేము భవిష్యత్తులో సాంకేతికత ,మానవ-కేంద్రీకృత పరిష్కారాలను రూపొందించడానికి తరగతి తరం నాయకులను శక్తివంతం చేస్తున్నాము,” అని తెలిపారు.

error: Content is protected !!