365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జులై 23,2021:దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకు లేవని, బిజేపీ ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. హుజురాబాద్ లో 68 మంది లబ్దీదారులకు 68లక్షలకు పైగా కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్లు పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ “ఆడబిడ్డకు అండగా నిలబడే కళ్యాణలక్ష్మీ, రైతు సాగుకు బరోసా ఇచ్చే రైతుబందు, వెనుకబడని వర్గాల పిల్లల్ని తీర్చిదిద్దే గురుకులాలు, నిరంతరంగా 24గంటల కరెంటు, ఆత్మగౌరవం కాపాడె ఆసరా ఫించను, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు, అత్యధ్బుతంగా దావాఖానల్ని డెవలప్ చేయడమే కాక 13వేలు ఇచ్చే కేసీఆర్ కిట్, ఇలా ఎన్నో పథకాలు ఎందుకు బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేయడం లేదని ప్రశ్నించారు గంగుల.పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి బారం కాకుడదని లక్ష రూపాయలకు పైగా మేనమామ కట్నంగా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుందని, అనంతరం కాన్పుకు అన్ని వసతుల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించడమేకాక కేసీఆర్ కిట్ తో ఆర్థిక భరోసాను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదన్నారు.
తర్వాత బిడ్డ పెరుగుతున్నప్పుడు కార్పోరేట్ చదువులకు దీటుగా గురుకులాల్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్లో అద్బుతంగా మాట్లాడే విదంగా తయారు చేస్తున్నామన్నారు.ఒకనాడు ఇబ్బందులతో, పైసలు లేక కూలీపనులకు మన బిడ్డల్ని తీసుకుపోయామని కానీ నేడు గురుకులాల్లో, ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ వాళ్లను ప్రయోజకులుగా, ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు మంత్రి గంగుల. రైతుబందు మాదిరే దళితబందు విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తుందని దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. నేడు సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో సమ్రుద్దిగా విజయాల్ని సాదిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇన్ని విదాలుగా అండగా నిలబడి అన్నం పెడుతున్న వారిని మర్చిపోకూడదని, సీఎం కేసీఆర్ గారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల.