365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 20,2025: సినిమాల్లో కొంతకాలంగా ఉపయోగిస్తున్న కొన్ని పాటల డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై కమిషన్ తీవ్రంగా స్పందించింది.
సమాజంపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి…టాటా ప్లే-ఫ్యాన్‌కోడ్ భాగస్వామ్యంతో క్రీడాభిమానులకు అదిరే అనుభవం
Read this also…Tata Play and FanCode Launch ‘Tata Play FanCode Sports’ to Bring 24/7 Live Sports Action to Indian Fans
ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు ,ఇతర సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూపే, అసభ్యకరమైన డాన్స్ మూమెంట్స్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది.
ఈ మార్గదర్శకాలను పాటించని సందర్భంలో, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యం అవుతుందని కమిషన్ హెచ్చరించింది.

సినిమా పరిశ్రమ సమాజానికి సమర్థవంతమైన, సానుకూల సందేశాలను అందించాల్సిన బాధ్యత వహించాలి. యువత, పిల్లలపై సినిమాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి…సునీతా విలియమ్స్ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసా..?
ఇది కూడా చదవండి…మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు: ఐమ్యాక్స్ ట్రైలర్‌తో వస్తున్న ‘L2E: ఎంపురాన్’!
ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశిత పరిశీలన కొనసాగిస్తూనే, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకోవడానికి కమిషన్ సిద్ధంగా ఉందని తెలియజేయడం జరుగుతుంది.