Mon. May 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 11,2023: ప్రముఖ తెలుగు నటుడు చంద్రమోహన్ (82) శనివారం కన్నుమూశారు.

గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఉదయం 9:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రమోహన్ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి చంద్రశేఖరరావుగా 1943 మే 23న జన్మించారు.

చంద్ర మోహన్ 1966లో రంగుల రాట్నం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1968లో వాణిశ్రీకి కేరింగ్ బ్రదర్‌గా సుఖ దుఃఖాలు చిత్రంలో నటించి అవార్డులు అందుకున్నారు. 932 సినిమాల్లో నటించారు.

చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.