365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 22,2023: తెలుగు సంవత్స రాదిగా భావించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఉగాది. అంతేకాదు దక్షిణ భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. హిందూ(పంచాంగం) క్యాలెండర్ ప్రకారం, ఇది ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు, ఇది సాధారణంగా మార్చి-ఏప్రిల్ మధ్య వస్తుంది. ఉగాది పండుగ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఉగాది 2023 తేదీ, ముహూర్తం: ఉగాది దక్షిణ భారతదేశంలోని ప్రధాన పండుగ. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉగాది అంటే కొత్త శకానికి నాంది అని అర్థం. ఇది కేరళ, కర్ణాటక, తెలంగాణ ,తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో నూతన సంవత్సరంగా భవిస్తూ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది ప్రతి సంవత్సరం చైత్రమాసం మొదటి రోజున జరుపుకుంటారు.
ఇది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుంది. ఉగాది పండుగ వసంత ఆగమనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున దైవాన్ని పూజించడం వల్ల కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు.
ఉగాది 2023 తేదీ: ఉగాది చైత్ర మాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, ఇది మార్చి ,ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది. ఈ ఏడాది మార్చి 22వ తేదీ బుధవారం రోజున ఉగాది వచ్చింది. ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పూజ ముహూర్తం: మార్చి 22, 2023, ఉదయం 06:29 నుంచి 07:39 వరకు.
ఉగాది 2023 ప్రాముఖ్యత..
దక్షిణ భారతదేశంలో ఉగాది పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం, ఉగాది కొత్త సంవత్సరానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రోజున బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. అంతేకాదు ఈ పండుగ రైతులకు చాలా ప్రత్యేకం.
ఎందుకంటే ఈ రోజు నుంచే పంట కాలం కూడా మొదలవుతుంది. ఉగాదికి సంబంధించి మరొక నమ్మకం ఏమిటంటే, ఈ రోజున శ్రీమహావిష్ణువు చేపగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు, యుధిష్ఠిర రాజు పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని చెబుతారు.