365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 28,2025:ఇన్‌స్టాగ్రామ్ నుంచి భారతీయ క్రియేటర్లకు భారీ బూస్ట్ వచ్చేసింది. రాబోయే నెలల్లోనే రీల్స్‌ను తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోకి ఆటోమేటిక్‌గా అనువదించి డబ్ చేసే సూపర్ ఫీచర్ లైవ్ అవుతోంది.

మెటా AI సహాయంతో ఒక్క క్లిక్‌లో మీ స్వరం, భావోద్వేగాలు అలాగే ఉండి.. నోటి కదలికలకు పర్ఫెక్ట్ లిప్-సింక్ కూడా వచ్చేస్తుంది. దీంతో తెలుగు క్రియేటర్ రీల్ ఇక తమిళం, కన్నడ, బెంగాలీ ప్రేక్షకులను సులువుగా చేరుకుంటుంది.

ఇక ఎడిట్స్‌లో కొత్త దేశీ ఫాంట్స్ యాడ్ అయ్యాయి. హిందీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషలకు సరిపడా అందమైన దేవనాగరి & బెంగాలీ-అస్సామీ స్క్రిప్ట్ ఫాంట్స్ ఆండ్రాయిడ్‌లో రాబోయే కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయి. “టెక్స్ట్” టూల్ ఓపెన్ చేసి “Aa” ఐకాన్ ట్యాప్ చేస్తే.. భాష వారీగా ఫాంట్స్ స్వైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు.

గత నెలలోనే వచ్చిన బల్క్ క్యాప్షన్ ఎడిటింగ్, వీడియో రివర్స్, ఫోటో లిప్-సింక్, 400+ సౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత.. ఈ కొత్త టూల్స్‌తో భారతీయ క్రియేటర్లు లోకల్ రూట్స్ ఉంచుకుని గ్లోబల్‌గా వైరల్ అవ్వడం ఇప్పుడు చాలా సులువు. తెలుగు రీల్స్ ఇక పాన్-ఇండియా హిట్ కావడం ఖాయం.