365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 16,2022: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు ఏకాంతంగా జరిగిన తెప్పోత్సవాలు బుధ‌వారంతో ముగిశాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగి క‌టాక్షించారు.