365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 31, 2025: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ (సత్తన్న) బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా టీజీవో విభాగం ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంక్షేమం కోసం, ముఖ్యంగా టీజీవో సంఘం బలోపేతానికి సత్యనారాయణ అందించిన సేవలు వెలకట్టలేనివని సంఘం ప్రతినిధులు కొనియాడారు. గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, నాయకత్వ పటిమ భావి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :According to Numerology: ఈ డేట్స్ లో పుట్టినవారికి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..?

Read this also: Hyderabad’s Deepa Jewellers Files for IPO to Raise Up to Rs.250 Crore..

Read this also: Bharat Forge Secures Milestone Rs. 1,661 Crore Contract for Indigenous Carbines..

హైదరాబాద్‌ జిల్లా టీజీవో సత్యనారాయణ పదవీ విరమణ అనంతర జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో సాగాలని హైదరాబాద్ జిల్లా టీజీవో అధ్యక్షులు ఎంబి కృష్ణ యాదవ్, కార్యదర్శి ఎంఏ ఖాదర్ ఆకాంక్షించారు.

Read this also:NICMAR Hyderabad and Victoria University Conclude Global Program on Sustainable Infrastructure..

Read this also: ICICI Prudential Life Launches ‘Wealth Forever’ to Simplify Legacy Planning..

సంఘం అభివృద్ధిలో ఆయనది కీలక పాత్రని, పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన అనుభవం సంఘానికి ఎప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ అధ్యక్షులు ఆశన్న, వైస్ ప్రెసిడెంట్ ఎన్జీలరెడ్డి, ట్రెజరర్ రమణ తదితరులు పాల్గొని సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు పలికారు.