365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 12,2023: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల.సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టిజివో) నాయకులు తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా తమవంతుగా ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతగా ముందుకు తీసుకెళ్తామని వారు వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు అందరం తోడ్పాడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టిజివో సంఘం తెలిపింది.
ఈ కార్యక్రమంలో పి.రవీందర్ కుమార్, ఎస్.సహదేవ్ నగర శాఖ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు, హైదారబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్.బి. కృష్ణాయాదవ్, బి.వెంకటయ్య, కృష్ణామూర్తి, సుజాత, సబిత, నిరంజన్ రెడ్డి, యాదగిరి, ఉమాకాంత్ తదితరులు కలిసి నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధానకార్యదర్శి ఏనుగుల.సత్యనారాయణ చెప్పారు.